దేశంలోనే సీనియరు… వ్యాఖ్యలు చౌకబారు..!

Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

‘పేరు గొప్ప… ఊరు దిబ్బ’..అ నే సామెత తెలిసిందే. ఒక కోణంలో గొప్పవారుగా పేరు తెచ్చుకున్నవారు, మరో కోణంలో చాలా అల్పంగా కనబడతారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే టైపు. తాను చాలా గొప్పవాడినని, ఎదుటివారు ఎందుకూ పనికిరానివారని, అధముల్లో మొదటి రకమని అభిప్రాయపడుతుంటారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరించారనేది అలా పక్కనుంచితే, అవశేష ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఆయన నోరు పాడైపోయింది. ఇది అందరి విషయంలో కాదు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ విషయంలోనే. ప్రధాని నరేంద్ర మోదీ విభజన చట్టాన్ని తుంగలో నిధులు ఇవ్వకుండా కర్రు కాల్చి వాత పెడుతున్నప్పటికీ గమ్మున ఉంటున్న చంద్రబాబు జగన్‌పై మాత్రం తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు.

రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సాధారణమే. కాని తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే ఏపీలో జుగుప్సాకరంగా మారాయి. బూతులు తిట్టుకోవడంలో సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ మధ్య తిట్లు, శాపనార్థాలు ఏనాడో శృతిమించి చెలియలికట్ట దాటారు. ఏడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ, ఉమ్మడి ఆంధ్రాకు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి, అవశేష ఆంధ్రాకు సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు అన్ని మర్యాదలు తుంగలో తొక్కారు. విమర్శలు చేయడంలో జగన్‌ విశృంఖలంగా వ్యవహరిస్తున్నది వాస్తవం. కాని చంద్రబాబు కూడా అలాగే వ్యవహరిస్తుండటం ఆయన పదవికి, అనుభవానికి గౌరవప్రదంగా లేదు. హుందాగా వ్యవహరించలేకపోతున్నారు.

జగన్‌పై దాడి చేయడానికి టీడీపీ నాయకులు ఎప్పుడూ సిద్ధమే. ఆ పని విజయవంతంగా చేస్తూనేవుండగా మధ్యలో బాబు దూరడం ఎందుకు? సరే…ఉండబట్టలేక విమర్శలు చేసినా అవి కాస్త అర్థవంతంగా ఉండాలి కదా. జగన్‌ పాదయాత్రపై ఎవ్వరూ స్పందించవద్దని , ఆచితూచి మాట్లాడాలని తమ్ముళ్లకు చెప్పిన అధినేత తనను తాను కంట్రోలు చేసుకోలేకపోతున్నారు. పాదయాత్ర ప్రారంభించాక చంద్రబాబు టీడీపీ నాయకులతో మాట్లాడుతూ ”జగన్‌ నిద్రలో కూడా సీఎం సీటు గురించే కలవరిస్తుంటారు. ఆయన ధ్యాస నిరంతరం దాని మీదనే. తాను సీఎం కావాలని కోరుతూ ప్రార్థనలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన నాయకుడు దేశంలో ఈయనొక్కరే. ఇటువంటి ప్రతిపక్ష నేత దొరకడం మనకు అదృష్టమో, దురదృష్టమో అర్థం కావడంలేదు”..అని వ్యాఖ్యానించారు.

పదవి యావ జగన్‌కు ఒక్కడికే ఉన్నట్లు, తాను సర్వసంగ పరిత్యాగిని అయినట్లు బాబు మాట్లాడుతున్నారు. ఓ పార్టీ అధినేతకు సీఎం కావాలనే కోరిక ఉండటం తప్పా? మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకే మరో ముప్పయ్‌ ఏళ్లు పదవిలో ఉండాలనే కోరిక ఉన్నప్పుడు అసలు కుర్చీయే ఎక్కని జగన్‌కు ఉండదా? బాబు ఆనాడు ఎన్టీఆర్‌ను దింపేసింది ముఖ్యమంత్రి పదవి కోసం కాదా? ”ఆయన (జగన్‌) అందరి గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడతారు. కాని తనకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పరు. హోదా గురించి మాట్లాడతారు. తమ ఎంపీల రాజీనామాల ఊసెత్తరు” అన్నారు బాబు.

తనకు ఫలానవిధంగా, ఫలాన మార్గాల ద్వారా ఆస్తులు వచ్చాయని బాబుకు చెప్పాలా? ఆయన తన హెరిటేజ్‌ సామ్రాజ్యం, ఇతర వ్యాపారాల గురించి ఎప్పుడైనా చెప్పారా? ఎంపీల రాజీనామాల ఊసెత్తలేదని జగన్‌ను తప్పు పడుతున్న బాబు ఫిరాయింపుదారుల రాజీనామాలపై ఏనాడైనా మాట్లాడారా? ”రాజధాని, పోలవరం, పట్టిసీమలో భూసేకరణకు అడ్డుపడ్డారు. కోర్టుల్లో కేసులు వేయించారు. నిధులు రాకుండా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంపారు. ఉపాధి హామీ నిధులు అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాశారు. వైసీపీ అత్యంత నేరప్రవృత్తి కలిగిన పార్టీ” అని బాబు వాఖ్యానించారు.

బాబు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షం చేసిన ప్రతి పనినీ ఆమోదించి ‘జీ హుజూర్‌’ అన్నారా? అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే కేసులు వేస్తారు, ఫిర్యాదులు చేస్తారు, లేఖలు రాస్తారు. ఇది ప్రతిపక్షం బాధ్యత. తాము ‘పులుకడిగిన ముత్యం’ అని సర్కారు నిరూపించుకోవాలి. చంద్రబాబు అండో కో ధర్మాత్ములా? జగన్‌ పార్టీ అత్యంత నేరప్రవృత్తి కలిగిన పార్టీయా? దీనికి కొలబద్దలు బాబు దగ్గర ఉన్నాయా? ఇదీ ఆయన నాలుగు దశాబ్దాల అనుభవం అండ్‌ సీనియారిటీ.