నయన్ బర్త్ డే.. పార్టీలో ఒకేఒక్కడు

నయనతార బర్త్ డే పార్టీ ఇచ్చింది. గ్రాండ్ గా జరిగిన ఆ పార్టీలో ఒకే ఒక్కడు పాల్గొన్నాడు. ఆ ఒక్కడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదిక్కడ. అతడే దర్శకుడు విఘ్నేష్ శివన్. అవును.. నయన్ ఇచ్చిన ప్రైవేట్ పార్టీకి విఘ్నేష్ ఒక్కడే హాజరయ్యాడు. ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇదేదో గాసిప్ కాదు. స్వయంగా విఘ్నేష్ వెల్లడించిన విషయం. “బర్త్ డే బాష్ విద్ నయన్” అంటూ విఘ్నేష్ సోషల్ మీడియాలో ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అంతే కాదు.. ఆ ప్రత్యేకమైన ఫొటోను తన ఫీచర్ ఇమేజ్ గా కూడా పెట్టుకున్నాడు. విఘ్నేష్ శుభాకంక్షలు చెప్పిన తర్వాతే నయనతార పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయట.

మొన్నటికిమొన్ని విఘ్నేష్ పుట్టినరోజును నయన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. తన సొంత ఖర్చుతో విఘ్నేష్ ను లాస్ ఏంజెల్స్ తీసుకెళ్లి మరీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయనతార పుట్టినరోజును విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడన్నమాట.

మొత్తానికి తమ మధ్య సాన్నిహిత్యాన్ని వీళ్లిద్దరూ రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు. వీలుచిక్కినప్పుడల్లా ఆ విషయాన్ని బయటపెడుతూనే ఉన్నారు.