తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. ఉద్యమ సమయంలో తన ముక్కు పై ఎంతో మంది కామెంట్స్ చేశారు. నన్ను తిటినన్ని తిట్లు మరెవ్వరిని కూడా తిట్టి ఉండదరు. అన్నింటిని భరించి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఎంతో మంది పాల్గొన్నారు. అందులో ఒకరు కౌశిక్ తండ్రి ఒకరు. ఆయన నాకు ఎంతో మద్దతుగా ఉండేవారు. ఇప్పుడు పార్టీలో కౌశిక్ కు తప్పకుండా మద్దతుగా నిలుస్తామని అన్నారు.
కౌశిక్ పార్టీలో జాయిన్ అయిన సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీలోకి ఇలాంటి యువకులు రావడం వల్ల మరింతగా జనాలకు మంచి జరుగుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ఇక దళిత బందును ఎన్నికల కారణంగానే ప్రారంభిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించాడు. ఔను ఎన్నికల్లో గెలుపు కోసమే దళిత బందును అక్కడ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎన్నికల్లో గెలవాలంటే ఇలాంటి పథకాలు ఏర్పాటు చేయాలి కదా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.