నితిన్ కి బ్యాడ్ టైంలో గుడ్ టైం!

భీష్మ లాంటి కమర్షియల్ చిత్రాన్ని మంచి సీజన్లో కాకుండా బ్యాడ్ టైంలో రిలీజ్ చేసారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. నితిన్ కి హిట్ అయితే వచ్చింది కానీ ఇంకా పెద్ద విజయం అందుకునే అవకాశం చేజారిందనే కామెంట్స్ పడ్డాయి.

అయితే ఫిబ్రవరిలోనే భీష్మ విడుదల చేయడం ఎంతో మంచిదయిందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఒకవేళ రిలీజ్ వాయిదా వేసినట్లయితే మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల చేయాల్సి వచ్చేది. మార్చిలో వచ్చినట్లయితే థియేటర్లు మూత పడ్డాయి కనుక భీష్మ డంగైపోయేది.

అదే ఏప్రిల్ వరకు ఆగినట్టయితే ఇప్పుడు ఎప్పటికి విడుదల అవుతాయో తెలియని సంకట స్థితిలో ఉన్న సినిమాల సరసన భీష్మ కూడా చేరేది. రిస్క్ చేసి డల్ సీజన్లో వచ్చేయడం వల్ల భీష్మ కరోనా ని తప్పించుకుని లాభాలు ఆర్జించగలిగింది. బ్యాడ్ టైంలో గుడ్ టైం అంటే ఇదేనేమో.