‘పక్కా’గా వస్తున్నాడా?

Pawan Kalyan political press meet on AP special status

‘రావడం లేట్‌ కావొచ్చేమోగానీ రావడం మాత్రం పక్కా’..అనే సినిమా డైలాగ్‌ మాదిరిగానే ఉంది పవర్‌ స్టార్‌ కమ్‌ ‘జనసేన’ అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యవహా రశైలి. ఆయన ఎంత పక్కాగా ఉన్నాడో అడుగు పెట్టా కనే తెలుస్తుంది. అక్టోబరు నుంచి జనంలోకి వస్తానని గతంలో చెప్పారు. అక్టోబరు వెళ్లిపోయింది. నవం బరూ సగంలోకి వచ్చేసింది. కాని ఏ సమాచారమూ లేదు. ఏవిధంగా వస్తాడో, ఏ కార్యక్రమాలతో వస్తాడో స్పష్టత లేదు.

కొంతకాలం క్రితం ఉద్దానం బాధితుల విషయంలో సీఎం చంద్రబాబుతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడారు. అది కూడా నంద్యాల ఉపఎన్నికలో పార్టీలకు తనమద్దతు గురించి మాత్రమే. ఆ ఎపిసోడ్‌ ముగిశాక తన కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పటివ రకు ఆయన చెప్పిన పని ఒక్కటీ చేయలేదు కాబట్టి అక్టోబరు నుంచి వస్తాడా? అనే సందేహం అప్పట్లో చాలామందికి కలిగింది. దాన్నే నిజం చేశారు.

నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది రెండు రోజుల్లో చెబుతానన్నారు. ఆ గడువు అయిపోయినా మౌనం వీడలేదు. ‘పవన్‌ ఎందుకు మాట్లాడటంలేదు?’ అంటూ రోజూ మీడి యా ప్రశ్న. ఎన్నిక దగ్గర పడుతున్నా నోటి వెంట మద్దతు మాట రాలేదు. ఆయన మద్దతు తమకే ఉంటుందని టీడీపీ నాయకులు గట్టిగా అనుకున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి పవన్‌ క్లోజ్‌ అని చెప్పారు. మద్దతు విషయం రెండు రోజుల్లో చెబుతా నని అన్న తరువాత ధైర్యంగా చెప్పాలి కదా.

ఆ ధైర్యం లేనప్పుడు తాను తటస్థంగా ఉంటున్నానని, ఎవ్వరికీ మద్దతు ఇవ్వనని చెప్పాలి. ఇంత చిన్న విషయంలోనే కమిట్‌మెంట్‌ లేకపోతే పెద్ద విష యాల్లో, క్లిష్టమైన సమస్యల విషయంలో ఈయన డీల్‌ చేయగలడా? పవన్‌ కళ్యాణ్‌కు ‘నిబద్ధత’ అనే లక్ష ణం, అంటే కమిట్‌మెంట్‌ ఉందా? ఏదైనా ఓ విష యం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలనే ఆలోచన ఉందా? చెప్పిన మాటకు కట్టుబడతాడా? ఇప్పటివరకైతే ఆ లక్షణం లేనట్లుగానే కనబడుతోంది.

వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయన ఎక్సర్‌సైజ్‌ ప్రారంభించారని చాలాకాలం కిందట సమాచారం వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా తీరు, ప్రభుత్వ పథకాల అమలు తీరు వగైరాలపై సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నారని అప్పట్లో ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఆ పత్రిక కథనం ప్రకారం.. పవన్‌ కళ్యాణ్‌ 2018 నుంచి జనంలోకి వచ్చేస్తారు.

అప్పటివరకు ఆయన ఎలాంటి ప్రచార పటాటోపం లేకుండా పూర్తిగా అధ్యయనంలో మునిగి వుంటారు. ప్రభుత్వానికి, పాలనకు సంబంధించిన సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేసేందుకు ఆయనకు సన్నిహితులైన కొందరు మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆ పత్రిక రాసింది. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు పవన్‌కు వివరిస్తున్నారట…!

తనకు వ్యతిరేకంగా రెండు తెలుగు ఛానెళ్లు పనిచే స్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్‌ తన శ్రేయోభిలాషులకు, సహకరిస్తున్నవారికి చెప్పారట…! పవన్‌ను కలుసుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాజకీయ పరిణామాలను, రాజధాని అమరావతి నిర్మాణ విశేషాలను, స్విస్‌ఛా లెంజ్‌ విధానాన్ని, భూసేకరణ/సమీకరణ సంగతు లను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఈ సబ్జెక్టులకు సంబంధించి కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టులు అందచేస్తు న్నారని తెలుస్తోంది. మరి ఇప్పటివరకు ఈ కసరత్తు పూర్తయిందో లేదో తెలియదు. సరే…ఆ విషయం అలా ఉంచితే, ఆయనకు సంబంధించిన ఓ ‘పక్కా’ సమాచారం తెలిసింది.

అదేమిటంటే… తెలంగాణ రాజధాని హైదరాబా దులో, ఏపీ రాజధాని అమరావతిలో, రెండు రాష్ట్రా ల్లోని జిల్లా కేంద్రాల్లో జనసేన పార్టీ కార్యాలయాల నిర్మాణానికి పవన్‌ సన్నాహాలు చేస్తున్నారట…! రెండు రాజధానుల్లో ఐదెకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు నిర్మిస్తారని జనసేన నాయకుల సమాచారం. తెలం గాణలో పాత ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో, ఏపీలోని జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలు నిర్మిస్తారు.

ఇవి ఏదో నామమాత్రంగా కాకుండా అన్ని వసతులతో పక్కాగా ఉంటాయి. సమావేశ మందిరాలతోపాటు యువతలో చైతన్యాన్ని, విజ్ఞానాన్ని పెంచేవిధంగా అధునాతన గ్రంథాలయం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, మేధావులు, నిపుణులు చర్చలు జరిపేందుకు తగిన సౌకర్యాలు… ఇలా సంపూర్ణమైన కార్యాలయాలు నిర్మాణం కాబోతున్నా యని సమాచారం. ఇంత పక్కా భవనాలు నిర్మించా లనే ఆలోచన చేశారంటే ‘పక్కాగా’ అంటే శాశ్వతంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లే కదా. పవన్‌ రాజకీయం ఎలా ఉన్నా కార్యాలయాల విషయంలో ఇంతనిబద్ధంగా వ్యవహరించడం అభినందనీయమే.

-మేనా