ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయినా యూ.వి. క్రియేషన్స్ మొదట్లో అన్నీ హిట్లు కొట్టినా పెద్ద సినిమాతో చేతులు కాల్చుకుంది. సాహో చిత్రానికి భారీగా పెట్టుబడి పెడితే భారీ స్థాయిలో లాస్ వచ్చింది. దాంతో తన ప్రస్తుత సినిమాకి బడ్జెట్ తగ్గించి యు.వి. కష్టాలు తీర్చాలని ప్రభాస్ భావించాడు. అందుకోసం స్వయంగా కూర్చుని కసరత్తు కూడా చేసాడు.
ఆ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలు కాగా కరోనా వల్ల మళ్ళీ బ్రేక్ పడింది. యు.వి. నష్టాలూ పూడడం లేదని ప్రభాస్ చాలా వర్రీ అవుతున్నాడట. ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ ఉండడంతో ప్రభాస్ పై ఒత్తిడి తీవ్రంగా ఉందని, ఈ చిత్రానికి పెట్టుబడి పరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అశ్వినీదత్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని యు.వి. వాళ్ళకి ఇచ్చాడని కూడా టాక్ ఉంది.