బన్నీ ఐటెంతో ఆడతాడా?

నా పేరు సూర్య టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ లోని క్రేజీ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాను ఏప్రిల్ 27నాటికి థియేటర్లలోకి తెచ్చేందుకు యూనిట్ బాగానే కష్టపడుతున్నారు. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోయినా.. అనుకున్న ప్లానింగ్ ప్రకారమే షెడ్యూల్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే.. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో రొమాన్స్ లింక్ కూడా ఉందనే సంగతి టీజర్ లోనే చెప్పేశారు. కానీ మాస్ ఎలిమెంట్స్ విషయంలో అల్లు అర్జున్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. డిఫరెంట్ జోనర్ లో మూవీ చేసినా.. అందరినీ అలరించే అంశాలు ఉండేలా జాగ్రత్త పడతాడు. అయితే.. ఇది ఒరిజినల్ కంటెంట్ కు అడ్డు పడడం కానీ.. డామినేట్ చేయడం కానీ చేయకూడదు. అందుకే నా పేరు సూర్య చిత్రంలో ఐటెం సాంగ్ గురించి మథన పడుతున్నారట యూనిట్. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను.. ప్రీ ప్రొడక్షన్ దశలోనే ప్లాన్ చేశారట. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఓ సాంగ్ ను రెడీ చేశారని కూడా అంటున్నారు.

కానీ ఈ చిత్రంపై ఏర్పడిన క్రేజ్ ను చూసి డైలమాలో పడ్డారట హీరో అల్లు అర్జున్.. దర్శకుడు వక్కంతం వంశీ. ఇప్పుడు ఐటెం సాంగ్ ను పెట్టడం ద్వారా.. డిఫరెంట్ కంటెంట్ చూడబోతున్నామనే ఆడియన్స్ అంచనాలను.. అనవసరంగా డిస్టర్బ్ చేసినట్లు అవుతుందా అని ఆలోచిస్తున్నారట. కానీ బన్నీకి ఐటెం సాంగ్స్ బాగా అచ్చొచ్చాయనే సంగతి తెలిసిందే. అందుకే ఈ పాటను సినిమాలో ఉంచాలా లేక తొలగించాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.