రంగస్థలంలో రామ్ చరణ్ డీగ్లామ్ క్యారక్టర్ చేసాడు కానీ గమనిస్తే అతని గడ్డం అందులో పాత్రకి తగినట్టు ఉండదు. ఆ పాత్రకి అనుగుణంగా గుబురు గడ్డంతో అసలు షేప్ లేని చింపిరి గడ్డంతో చరణ్ కనిపించాలి. కానీ చరణ్ అంత డీగ్లామ్ కనిపించడానికి ఇష్టపడలేదు. అందుకే స్టైలిస్ట్ ని పెట్టుకుని ట్రిమ్ చేయించుకుని కాస్త నీట్ గానే కనిపించాడు.
ఇప్పుడంటే గడ్డలు షేప్ చేస్తున్నారు కానీ ఎనభైల కాలంలో పల్లెటూరి యువత అలా లేరు. ఇక విషయానికి వస్తే సుకుమార్ తో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలోనూ హీరో పాత్ర డీగ్లామ్ గా మాస్ గా కనిపిస్తుంది. ఇందుకోసం బన్నీ ఎలాంటి స్టైలిస్ట్ ని పెట్టుకోడం లేదు.
జుట్టు, గడ్డం బాగా పెంచేసి చాలా రగ్గడ్ గా తమిళ హీరోల మాదిరిగా కనిపించబోతున్నాడు. ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించే అల్లు అర్జున్ ఈసారి మాత్రం తన రెగ్యులర్ గెటప్ కి భిన్నంగా కనిపిస్తాడు.