బిప్స్‌ కండోమ్‌ యాడ్‌: అవేర్‌నెస్‌ మాత్రమేనట.!

బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు, సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఎంచక్కా పెళ్ళి చేసేసుకుంది. బిపాసా బాలీవుడ్‌ తెరపై ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాయ్‌ఫ్రెండ్‌ జాన్‌ అబ్రహాంతో బిపాసా ‘సహజీవనం’ గురించీ అందరికీ తెల్సిందే. అప్పట్లో బిపాసా – జాన్‌ అబ్రహాం రీల్‌ లైఫ్‌లో, రియల్‌ లైఫ్‌లో రెచ్చిపోయారంతే.!

జాన్‌ అబ్రహాంతో బ్రేకప్‌ అయ్యాక, కొన్నాళ్ళు ‘సింగిల్‌’గానే లైఫ్‌ని ఎంజాయ్‌ చేసిన బిపాసా ఇటీవల కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ని పెళ్ళాడింది. తాజాగా ఈ బ్యూటీ, తన భర్తతో కలిసి ఓ కండోమ్‌ ప్రకటనలో కన్పించింది. అదిప్పుడు వివాదాస్పదమయ్యింది. సోషల్‌ మీడియాలో బిపాసా పోస్ట్‌ చేస్తోన్న ఫొటోలు చూసి, ‘ఇకనేం, పోర్న్‌ సినిమాల్లో నటించేయొచ్చు కదా..’ అంటూ ఆమెకు నెటిజన్లు ఉచిత సలహా ఇస్తున్నారు.

ఈ తరహా ట్రాలింగ్‌పై బిపాసా గుస్సా అవుతోంది. ‘నేనేమీ డబ్బుల కోసం ఆ యాడ్‌లో నటించడంలేదు.. కండోమ్‌ వినియోగం వల్ల కలిగే మేలు గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నా..’ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పింది బిపాసా బసు. ‘ఇంత పెద్ద దేశంలో కండోమ్‌ వినియోగం అనేది ఓ పాపంగా భావించడమేంటి.?’ అన్నది బిపాసా బసు ప్రశ్న.

బాగానే వుంది.. సన్నీలియోన్‌ చేస్తోంది కదా, తానెందుకు చెయ్యకూడదనుకుందో ఏమో బిపాసా బస్సు కండోమ్‌ ప్రకటనల్లో నటించేస్థాయికి తనను తాను దిగజార్చేసుకుని, అక్కడికేదో సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేస్తున్నానంటే ఎలా.? ‘నేను నటిని, అది కూడా నటనే..’ అనేస్తే సింపుల్‌గా మేటర్‌ క్లియర్‌ అయిపోయేది. ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నట్లు క్లాసులు తీసుకుంటే, ఇదిగో ఇలాగే ట్రాలింగ్‌ తప్పదు మరి.!