భరత్‌ కోసం కోట్లలో దండోరా

భరత్‌ అనే నేను పబ్లిసిటీ విషయంలో మహేష్‌ చాలా కేర్‌ తీసుకుంటున్నాడు. తన గత చిత్రాలు రెండూ దారుణంగా విఫలం కావడంతో మహేష్‌ స్టార్‌డమ్‌ ఎఫెక్ట్‌ అయింది. అతడిని కించ పరిచేలా మీడియాలో చాలానే కథనాలు వచ్చాయి. ఇక సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ అయితే విపరీతంగా పెరిగిపోయాయి. వాటన్నిటికీ చరమగీతం పాడేలా తన తాజా చిత్రం భరత్‌ అనే నేను మోగిపోయే బ్లాక్‌బస్టర్‌ కావాలని మహేష్‌ స్వయంగా మార్కెటింగ్‌ విషయాలని పరిశీలిస్తున్నాడు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ని పిలవాలనేది కూడా మహేష్‌ ఇచ్చిన ఐడియానే అని కొరటాల శివ చెప్పాడు. దీనిని బట్టి యాంటీ ఫాన్స్‌ని కూడా మెప్పించేందుకు మహేష్‌ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడేది అర్థమవుతోంది. ఈ చిత్రానికి పబ్లిసిటీ నిమిత్తమే ఏడెనిమిది కోట్లు కేటాయించారట. ఒక రీజనల్‌ సినిమా కోసం ఇంత ఖర్చు అంటే ఆషామాషీ కాదు. కేవలం హైదరాబాద్‌ సిటీలో హోర్డింగ్స్‌, బిల్‌బోర్డ్స్‌ పోస్టర్స్‌కే మూడు కోట్లకి పైగా ఖర్చు పెట్టారట. ఇక టీవీ, పేపర్‌, వెబ్‌ పబ్లిసిటీలో అస్సలు తగ్గడం లేదు. అన్నిటికీ ఫుల్‌ కెపాసిటీ బడ్జెట్‌ కేటాయించి అన్ని వైపులా కవర్‌ చేస్తున్నారు.

కొరటాల శివతో పాటు మహేష్‌ కూడా కూర్చుని పబ్లిసిటీపై ప్లాన్‌ చేయడం వల్లే ఈ రేంజ్‌లో ప్రమోషన్‌ వుందని సమాచారం. సోషల్‌ మీడియా, ఇతర మీడియా కోసం విడివిడిగా టీమ్స్‌ని అపాయింట్‌ చేసారు. విడుదలైన రోజున సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ బజ్‌ బాగా స్ప్రెడ్‌ అయ్యేట్టు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.