శంకర్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టోరీకి అనుగుణంగా కళ్లు చెదిరేలా ఫైట్స్ డిజైన్ చేయడం శంకర్ టీమ్ ప్రత్యేకత. యాక్షన్ సన్నివేశాల్లో ఆయనకంటూ ఓ కాన్సెప్ట్ విజన్ ఉంటుంది. దాని ఆధారంగా శంకర్ స్టంట్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేస్తుంటారు. ఇక భారీ యాక్షన్ చిత్రాల విషయంలో శంకర్ విజన్ అసాధారణంగా ఉంటుంది. ఊహకందని స్టంట్స్ తో ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటారు.
మరి ‘ఇండియన్-2’ కోసం శంకర్ యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతు న్నారో? తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా కీలక యాక్షన్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దించినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కమల్ చుట్టూ విదేశీ స్టంట్ మాస్టర్లు కనిపిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశానికి ముందు ఇలా అంతా మాట మంతి చేస్తున్నారు. దీన్ని బట్టి ‘ఇండియన్ -2’ శంకర్ ఎలాంటి ఎఫెర్ట్ తో పనిచేస్తున్నారో? అద్దం పడుతుంది. ఇక భారతీయుడు లో యాక్షన్ సన్నివేశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అందులో వృద్దుడి పాత్రపై చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. వందల ఏళ్ల కిందట ప్రాచుర్యంలో ఉండే మర్మకళ ఈసినిమా లో స్టంట్స్ కంపోజ్ చేసే సమయంలో వినియోగించారు.
ఇది ఎప్పుడో అంతరించిపోయిన కళ భారతీయుడు రూపంలో ప్రేక్షకులకు మళ్లీ కనిపించింది. ప్రత్యర్ధి నరాలు..నాడి పనిచేయకుండా చేయడం ఈ విద్య గొప్పతనం. కొన్ని రకాల టెక్నిక్ తో ఎంతటి బలవంతుడినైనా సులువుగా పడగొట్టొచ్చు.
మరి ‘ఇండియన్-2’ కోసం అలాంటి టెక్నిక్స్ ఏమైనా దించుతున్నారా? లేక విదేశీ మాస్టర్లతో అంతకు మంచి ఇంకేదైనా చేయిస్తున్నారా? అన్నది తెలియాలి. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇది లాంగ్ షెడ్యూల్ . దాదాపు నెల రోజులకు పైగానే ఇక్కడ చిత్రీకరణ జరుగుతుందని సమచారం. ఈ షెడ్యూల్ లో చందమామ కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటుంది. ఇందులో కమల్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.