మరికొన్ని గంటల్లో ‘అ!’ అనిపిస్తాడట

‘అ!’ సినిమాకు సంబంధించి అంతా ఆశ్చర్యమే. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్స్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు మేకర్స్. కాజల్, నిత్యామీనన్ లాంటి లుక్స్ మినహాయిస్తే.. మిగతా అన్ని పాత్రల పరిచయం డిఫరెంట్ గానే జరిగింది. ఇప్పుడా ఆశ్చర్యానికి కొనసాగింపుగా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5గంటలకు ‘అ!’ టీజర్ రాబోతున్నట్టు ప్రకటించాడు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాని.

‘అ!’ సినిమాలో నాని, రవితేజ ఉన్నారు. కానీ వాళ్ల రూపాలు తెరపై కనిపించవు. నాని ఓ చేపలా, రవితేజ ఓ చిన్న చెట్టుగా మాత్రమే మనకు కనిపించి వినిపిస్తారు. ఇప్పుడా పాత్రలకు సంబంధించిన విజువల్స్ టీజర్ లో కనిపించే ఛాన్స్ ఉంది.

తెలుగుతెరపై ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదంటున్నాడు నాని. అందుకే తను నిర్మాతగా మారానని చెబుతున్నాడు. పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్స్ వచ్చేశాయి కాబట్టి.. ఈరోజు టీజర్ ను రిలీజ్ చేసి, త్వరలోనే ట్రయిలర్ ను లాంచ్ చేసి ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చేస్తామంటున్నాడు.

‘అ!’ సినిమాతో ప్రశాంత్ వర్మ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. కాజల్, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మ, ఇషా, ప్రియదర్శి, రెజీనా కీలక పాత్రలు పోషించారు.