మూడోసారి పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఆమె ఎవరంటే..

తమిళ సీనియర్ నటి వనిత విజయ్ కుమార్ జూన్ 27న చెన్నైలో సినీ పరిశ్రమకు చెందిన పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇది మూడో పెళ్లి కావడం విశేషం. ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కు ఈమె పెద్ద కుమార్తె. ఈమెకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. 2000లో నటుడు ఆకాశ్ తో పెళ్లవగా 2005లో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2007లో ఆనంద్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. ఈ వైవాహిక జీవితం కూడా ఆమెకు ఎక్కువకాలం నిలవలేదు. 2012లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. వనతకు ఇప్పటికే జోవికా, జయనిత అనే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. వనిత తండ్రి విజయ్ కుమార్ కు ఉన్న ఐదుగురు పిల్లల్లో వనిత పెద్ద కుమార్తె. ఈమె తెలుగులో 1999లో వచ్చిన తెలుగు మూవీ దేవీలో నటించింది. పలు తమిళ సినిమాల్లో కూడా వనిత నటించింది. ఇటివల తమిళ బిగ్ బాస్3లో కూడా నటించింది.