మెగాక్యాంప్ సహనాన్ని పరీక్షించవద్దు

తొలిసారి మెగా క్యాంప్ నుంచి గట్టి సమాధానం వచ్చింది. ప్రతి ఒక్కడు కావాలని మెగా క్యాంప్ ను టార్గెట్ చేస్తే సహించేది లేదని మెగాస్టార్ చిరు సోదరుడు నాగబాబు గట్టి హెచ్చరికే చేసారు.ప్రతీ ఒక్కరికీ ఇదో అలవాటైపోయిందని, చేతిలో ఫోన్ వుందని మెగా క్యాంప్ ను టార్గెట్ చేస్తున్నారని, ఎవరో చేస్తున్నదానికి పదే పదే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సమాదానం చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటని? ఆయనకు మరో పని లేదా? ఇదే పనిగా పెట్టుకోవాలా? అని నిలదీసారు.

అవసరం అయితే ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని, తానుచాలని, తమ సహనాన్ని పరీక్షించవద్దని, అలాగే చేస్తే, తాము ఎలా రియాక్ట్ అవుతామో తమకే తెలియదని, మళ్లీ ఇదే ఇస్యూపై డిస్కషన్లు పెట్టవద్దని నాగబాబు హెచ్చరించారు.

మొత్తంమీద జీవిత రాజశేఖర్ తరువాత సినిమా రంగం నుంచి గట్టి గొంతు వినిపించినట్లే. శివాజీ రాజా ఫెయిల్యూర్ కు, నాగబాబు అటాక్ కు సరిగ్గా సరిపోయింది. శ్రీరెడ్డి ఇస్యూ నెమ్మదిగా గ్రాఫ్ దిగుతోంది అన్న టైమ్ లో టాలీవుడ్ అటాక్ స్టార్ట్ అయింది. పెర్ ఫెక్ట్ ప్లానింగ్ అనుకోవాలి.