రంగస్థలం – ఓ సేఫ్ ప్రాజెక్ట్

స్పైడర్ 120 కోట్ల సినిమా. పవన్ అజ్ఞాతవాసి 150 కోట్ల సినిమా. ఇలా వుంది వ్యవహారం. కానీ మైత్రీ మూవీస్ మాత్రం సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న రంగస్థలం సినిమాను ఇటు తమకు, అటు బయ్యర్లకు సేఫ్ గా వుండే బడ్జెట్ లోనే నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్ట్ 60కోట్ల రేంజ్ లోనే బడ్జెట్ ఖర్చవుతోంది. పబ్లిసిటీ, ప్రీ రిలీజ్ ఖర్చులు మహా అయితే మరో అయిదు కోట్లు.

అంటే టోటల్ గా 65కోట్లు. ఇందులో శాటిలైట్, డిజిటల్, అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ ఇలా అన్నీకలిపి 30 కోట్లకు పైగా రాబట్టేస్తున్నాయి. అంటే ఇంక థియేటర్ రైట్స్ ద్వారా రావాల్సింది జస్ట్ ముఫై అయిదు కోట్లు మాత్రమే. ఈ మాత్రం అమౌంట్ ఆంధ్ర-సీడెడ్ లు కలిపి వచ్చేస్తుంది. ఇక నైజాం, ఓవర్ సీస్, కర్ణాటక వుండనే వుంటుంది.

పెద్ద హీరోలు ఎవరైనా సరే, ఈ రేంజ్ లో ప్రాజెక్టులు చేసుకుంటే అందరూ సేఫ్ అవుతారు. నిర్మాతలకు టెన్షన్ వుండదు. హ్యాపీగా వుంటుంది. బయ్యర్లు భయపడాల్సిన పని వుండదు. కానీ మనవాళ్లు నాలుగైదు దెబ్బలు తింటే కానీ, వెనక్కురారు కదా?