‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫ్లాపయితే ఎన్టీఆర్‌దే తప్పు.?

మీకు తెలుసా.? ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా స్క్రిప్ట్‌ రామ్‌గోపాల్‌ వర్మ రాస్తున్నారంతే.. ఆయనతో అలా రాయిస్తున్నది మాత్రం స్వర్గీయ ఎన్టీఆర్‌. దేవుళ్ళంటే నమ్మకం ఏమాత్రం లేని వర్మ, దెయ్యాల్ని బాగా ఇష్టపడ్తారు. అది ఆయన ప్రత్యేకత. దెయ్యాల సంగతి పక్కన పెడితే, కొత్తగా ఆత్మలతో సావాసం చేస్తున్నారాయన. అందుకు నిదర్శనం, స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆత్మ – వర్మతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకి స్క్రీన్‌ప్లే రాయిస్తుండడమే.

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పెటోడు డాష్‌ డాష్‌ అన్నాడట వెనకటికి ఒకడు. వర్మ చెప్పే మాటలు కూడా ఇలాగే వున్నాయి. ‘నా దృష్టి కోణంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలోని ఓ పర్వాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నా..’ అని గతంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ గురించి చెప్పిన వర్మ, ఇప్పుడు ఆ సినిమాకి స్క్రీన్‌ప్లే రాయిస్తున్నది స్వయానా ఎన్టీఆర్‌ ఆత్మ.. అని చెబుతోంటే వర్మని ఎలా అర్థం చేసుకోవాలట.?

సినిమా ఇప్పుడప్పుడే కాదు, ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళుతుందట. ఇంత ముందుగా వర్మ కథ రెడీ చేయడం, స్క్రీన్‌ప్లే రాసేస్తుండడం నిజమేనా.? ఆ ఒక్కటీ అడక్కండంతే. అంతా బాగానే వుందిగానీ, ‘వంగవీటి’ తరహాలో సినిమా తేడా కొట్టేస్తే, ఆ తప్పు ఎవరిదట.? వర్మ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, నూటికి నూరుపాళ్ళూ ఎన్టీఆర్‌దే అవుతుంది. ఎందుకంటే, స్క్రీన్‌ప్లే వర్మతో రాయిస్తున్నది ఎన్టీఆర్‌ ఆత్మే కదా