లుక్కులు ఎక్కువయ్యాయి బాలకృష్ణుడా?

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు హీరో నారా రోహిత్. కష్టపడి సిక్స్ ప్యాక్ చేసాడు. కానీ మళ్లీ ఈ మధ్య ఫిజిక్ కాస్త తేడాగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న జగపతి బాబుతో కలిసి చేయబోయే మూవీ ఫొటోల్లో రోహిత్ ను చూసిన వారి ఒపీనియన్ ఇది.

సరే ఆ సంగతి అలా వుంచితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తయారుచేస్తున్న సినిమా బాలకృష్ణుడు. పరిటాల రవి, పరిటాల సునీత పాత్రలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని అల్లుకున్న కథ అని వినికిడి. ఈ సినిమాకు ముందుగా ఒక టీజర్ వదిలారు. అందులో రోహిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. ఆ తరువాత ట్రయిలర్ వదిలేసారు ఏకంగా. ఫరావాలేదు ట్రయిలర్ అనేటట్లు వుంది. కానీ ఈ ట్రయిలర్ లో రోహిత్ లుక్స్ కాస్త డిఫరెంట్ గా వున్నాయి.

ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చి దీపావళి గ్రీటింగ్స్ అంటూ మరో స్టిల్ వదిలారు. ఇక్కడ మళ్లీ రోహిత్ రొటీన్ లుక్ తోనే కనిపించాడు. ఆదికి ముందే ట్రయిలర్ వదిలేసాక మళ్లీ ఈ లుక్కులు ఎందుకో? సినిమా విడుదలకు కాస్త ముందుగా ట్రయిలర్ ఇచ్చే పని పెట్టుకుని వుంటే, మధ్యలో ఇలా ఇచ్చినా ఫరవాలేదు. లేదూ అంటే లుక్కులు ఎక్కువై, ఒక్కోటి ఒక్కో మాదిరిగా వుంటే, కాస్త కన్ఫ్యూజ్ గా వుంటుంది.