విశాల్‌ పొలిటీషియన్‌ కాదట.. నమ్మేద్దామా.?

తమిళ హీరో విశాల్‌ రాజకీయాల్లోకొచ్చేశాడు. రాజకీయాల్లోకి వచ్చాక, విశాల్‌ రాజకీయ నాయకుడు కాకుండా పోతాడా.? ఆల్రెడీ రాజకీయ నాయకుడైపోయాడు. తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ‘ఇండిపెండెంట్‌ అభ్యర్థి’గా పోటీ చేస్తున్నాడు విశాల్‌. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, తాను రాజకీయ నాయకుడ్ని కాననీ, సామాన్యుడినేనని విశాల్‌ చెబుతుండడం గమనార్హం.

‘చాలా ఏళ్ళుగా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకడంలేదు. పాలకులు మారుతున్నారుగానీ, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డంలేదు.. విద్య కోసం సామాన్యులు నానా ఇబ్బందులూ పడుతున్నారు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు.. చాలా చాలా సమస్యలున్నాయి.. ఈ సమస్యలన్నీ ఆర్కేనగర్‌కే పరిమితం కావు. చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలున్నాయి. వాటన్నిటిపైనా నా పోరాటం కొనసాగుతుంది. ఎన్నికల తర్వాత కూడా నా పోరాటం ఆగదు..’ అంటున్నాడు విశాల్‌.

రాజకీయ నాయకుడ్ని కాదంటూనే, రాజకీయంగా విశాల్‌ వేస్తున్న అడుగులు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎంజీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించడం.. జయలలిత సమాధి వద్ద నివాళులర్పించడం.. ఇవన్నీ చూస్తోంటే, విశాల్‌ పక్కా ప్లానింగ్‌తోనే రాజకీయాల్లోకి వచ్చాడనే విషయం అర్థమవుతోంది. ‘రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ని చూశాకే వచ్చింది..’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్‌ చెప్పడం గమనార్హం.

పార్టీల్నీ, వ్యక్తుల్నీ రాజకీయాల్లో విమర్శించాల్సి వస్తుందనీ, తాను ప్రస్తుతానికైతే సమస్యల మీదే పోరాటం చేస్తాననీ, ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గబోనని విశాల్‌ చెబుతున్నాడు. ‘గెలుపోటముల్ని కాలమే నిర్ణయిస్తుంది..’ అంటూ ఆర్కేనగర్‌ ఉప ఎన్నికపై విశాల్‌ తనదైన స్టయిల్లో స్పందించాడు.

మొత్తమ్మీద, రాజకీయాల్లోకి వచ్చేశాక ‘నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. సామాన్యుడిని’ అని చెబితే ఎలా.? కేజ్రీవాల్‌ అయినా రాజకీయ నాయకుడే, రాజకీయాల్లో వున్నవారెవరైనా రాజకీయ నాయకులే.. విశాల్‌ ఇందుకు