శ్రీరెడ్డి సెక్స్ వీడియోలు.. ఆ ముగ్గురు హీరోలు?

సుచిలీక్స్ తరహాలో మరో భారీ ఎపిసోడ్ ప్రారంభం కాబోతోంది. ఈసారి కేంద్రం కోలీవుడ్ కాదు. స్వయంగా టాలీవుడ్ లో అలాంటి లీక్స్ రాబోతున్నాయి. తెలుగు చిత్రసీమకు చెందిన ఎంతోమంది ప్రముఖుల రాసలీలలు బయటపడబోతున్నాయి. ఈ మేరకు తన వద్ద చాలా వీడియోలు ఉన్నాయని చెబుతోంది నటి శ్రీరెడ్డి.తనతో చాలామంది సినీ ప్రముఖులు సెక్స్ చేశారంటూ ఆమధ్య శ్రీరెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తామంటూ అమ్మాయిల్ని లోబరుచుకునే నిర్మాతలు, హీరోలు, దర్శకుల వివరాల్ని బయటపెడతానంటూ మీడియాకెక్కిన శ్రీరెడ్డి, చెప్పినట్టుగానే తన వద్ద ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. ఇందులో భాగంగా ఓ నిర్మాతతో జరిపిన వాట్సాప్ ఛాట్ ను బయటపెట్టింది.

అయితే ఇది శాంపిల్ మాత్రమే. “శ్రీరెడ్డి లీక్స్” లో భాగంగా ఇప్పటివరకు ఫొటోలు మాత్రమే వచ్చాయి, త్వరలోనే వీడియోలు కూడా రాబోతున్నాయని సమాచారం. ఈ మేరకు కీలకమైన ఇద్దరు పీఆర్వోలకు ఓ వీడియో పంపించిందట శ్రీరెడ్డి. ఓ స్టార్ డైరక్టర్ అందులో శ్రీరెడ్డితో సెక్స్ చేస్తున్నాడు. తనకు అవకాశం ఇస్తానంటూ సదరు దర్శకుడు ఇలా తనను వాడుకున్నాడని ఆరోపిస్తోంది శ్రీరెడ్డి.కేవలం ఈ దర్శకుడు మాత్రమే కాదు.. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలుగా చలామణి అవుతున్న ముగ్గురు హీరోల బాగోతాలు కూడా తన వద్ద ఉన్నాయంటోంది శ్రీరెడ్డి. వీళ్లు కూడా గతంలో తనను వాడుకున్నారని, అవసరమైతే ఆ హీరోల వీడియోల్ని కూడా బయటపెడతానంటోంది. ఇప్పుడా హీరోలు ఎవరనేది ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారింది.

ఆ ముగ్గురు హీరోలు రెగ్యులర్ గా పార్టీలకు వచ్చిపోతుంటారు. కొత్తకొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు కోరుకునేవాళ్లలో వీళ్లు ముందుంటారు. మరీ ముఖ్యంగా వీళ్ల సినిమాల్లో కొత్త హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి ముగ్గురు హీరోలు తన వీడియోల్లో ఉన్నారంటోంది శ్రీరెడ్డి.అయితే అవకాశాల కోసం శ్రీరెడ్డి ఈ పని చేస్తోందా, లేక సదరు ప్రముఖుల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడం కోసం ఇలా చేస్తోందా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే గతంలో సుచిలీక్స్ ఉదంతంలో కూడా కోట్ల రూపాయలు చేతులు మారినట్టు వార్తలొచ్చాయి. ఆ వెంటనే లీకులు కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత సుచిలీక్స్ పార్ట్-2 కూడా ప్రారంభమైంది. వెంటనే అది సద్దుమణగడానికి కారణం కూడా డబ్బులు చేతులు మారడమే. ఇప్పుడు శ్రీరెడ్డి సెక్స్ వీడియోల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.