సన్నీలియోన్‌ రాజకీయాల్లోకి వస్తే.!

ఏం, సన్నీలియోన్‌ ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు.? పుట్టి పెరిగింది విదేశాల్లో గనుక, సన్నీలియోన్‌కి ఆ ఛాన్స్‌ లేదని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయాల్లోకి ఆమె రావాలనుకుంటే, అందుకు తగ్గ ‘ఏర్పాట్లు’ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా, సన్నీలియోన్‌కీ – రాజకీయానికి ‘లింక్‌’ పెట్టడమేంటబ్బా.? ఈ క్రియేటివిటీ ఎవరిదని అనుకుంటున్నారా.! ఇంకెవరిది, రామ్‌గోపాల్‌ వర్మది.

పవన్‌కళ్యాణ్‌ మీద రామ్‌గోపాల్‌ వర్మకి ‘అభిమానం’ చాలా ఎక్కువ. ఆ ‘అభిమానానికి’ అర్థం వేరే వుంది లెండి. ఆ అభిమానంతోనే, పవన్‌కళ్యాణ్‌ – సన్నీలియోన్‌ కలిసి రాజకీయాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఇంత గొప్ప ఆలోచన ఆయనకి తప్ప ఇంకెవరికీ రాదేమో.! క్రియేటివిటీలోనే పీక్స్‌ అన్నట్టుంది కదా.? పీక్స్‌ కాదిది, పాతాళానికి పడిపోవడమంటారా.! అయితే, అది మీ తప్పు కానే కాకపోవచ్చు.

సన్నీలియోన్‌ ఓ రాజకీయ పార్టీ పెట్టి, పవన్‌ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని జనంలోకి వెళితే, ఇద్దరికీ ఫాలోయింగ్‌ విపరీతంగా వుంది గనుక.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా పవన్‌కళ్యాణ్‌ వీరాభిమాని ‘వర్మ’ తన అభిప్రాయాన్ని ‘రాసేసుకున్నాడు’. వర్మ అంతే, ఆయన ఆలోచనలు ఇలాగే వుంటాయ్‌ మరి.

రామ్‌చరణ్‌, రాజమౌళి, ఎన్టీఆర్‌ కలిసి ఓ ఫొటోకి పోజిస్తే, మల్టీ స్టారర్ సినిమా ఈ ముగ్గురి నుంచీ వస్తోందని అంతా అనుకున్నారు. కానీ, అందులో ‘గే’ లుక్‌ కన్పించింది వర్మకి. అదీ ఆయనలోని క్రియేటివిటీ. తెలుగులో ఓ సామెత వుంది, ‘పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా వుంటుంది’ అని. వర్మకి ‘అలా’ అన్పించడానికి కారణమేంటబ్బా.?

ఏదిఏమైనా, ఇటు పవన్‌కళ్యాణ్‌ మీదా అటు సన్నీలియోన్‌ మీదా ‘వర్మ’ అభిమానం ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందులో భాగమే సన్నీలియోన్‌తో పవన్‌కళ్యాణ్‌ రాజకీయం.. అన్న ఆయనగారి ఆలోచన. నాగార్జునతో కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా, ‘నా మైండ్‌ దొబ్బింది నిజమే..’ అన్న వర్మ మాటలు నిజమేనని అన్పిస్తోంది కదూ.!