సమంత ఏమైపోయింది?

మాములుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత ఎందుకో ఈమధ్య అసలు కనిపించడం లేదు. ట్వీట్లు బాగా తగ్గించేసింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా సందడి తగ్గిపోయింది. ఒకవైపు సినిమా పరిశ్రమ నుంచి సెలెబ్రిటీలు అంతా జనాలకు జాగ్రత్తలు చెబుతూ, క్వారంటైన్ లో ఉన్న వీడియోలు షేర్ చేస్తుంటే ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండడానికి ఇష్టపడే సమంత మాత్రం సైలెంట్ గా ఉంటోంది.

నాగ చైతన్య తన వంతుగా డొనేషన్ ప్రకటించాడు కానీ సమంత తన సొంత చారిటీ సంస్థ నుంచి కూడా ఏమీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. జాను ఫెయిల్ అయినా తర్వాత సమంతలో కాస్త మార్పు కనిపిస్తోంది.

ఆమధ్య ఒక ఫెయిల్యూర్ కె తనని ప్లాప్ హీరోయిన్ అంటున్నారని, హీరోలు ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా అలా అనరేంటని అసహనం వ్యక్తం చేసింది. సమంత ఎందుకని సడన్ గా సైలెంట్ అయిపోయిందో ఏమో మరి.