సైరా.. మరో షాక్?

సైరా సినిమా మీద భలే గ్యాసిప్ లు పుడుతున్నాయి. ముందు గ్యాసిప్ లు గా పుట్టి నిజాలై కూర్చుంటున్నాయి. ముందు సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు. ఆ పై సంగీత దర్శకుడు తప్పుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ కూడా డవుట్ అంటూ గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. ఇదే నిజమైతే, సైరా సినిమాకు పెద్ద కుదుపే అనుకోవాలి.

సైరా సినిమాకు నయనతారను తీసుకున్నారు. కానీ సైరా సినిమా అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నే చాలా టైమ్ తీసుకుంది. ఆపైన టెస్ట్ షూట్ చేసారు. ఇప్పటికి ఇంకా మ్యూజిక్ డైరక్టర్ లేరు. కీరవాణితో చర్చలు కొలిక్కి రాలేదు.దాంతో నయనతార ముందుగా ఇచ్చిన డేట్లు మురిగిపోయాయి. ఇప్పుడు నయనతార వేరే సినిమాల్లో బిజీగా వుందట. మరి ఆమె కోసం సైరా షూటింగ్ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటారో? లేక షూటింగ్ కోసం నయనతారను కాకుండా వేరెవరినైనా తీసుకుంటారో?

ఎవరు రెడీ గా వుంటారు? ఈ ప్రాజెక్టు కోసం? మళ్లీ కాజల్ యేనా? లేక తమన్నా కూడా రెడీనే. కళ్యాణ్ రామ్, సందీప్ కిషన్ లతో చేస్తున్న తమన్నా ఈ ప్రాజెక్టుకు అడిగితే కాదంటుందా?