‘మంచు’ ప్రయత్నం: అక్కినేని వెబ్ సిరీస్?

వెబ్ సిరీస్ కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నవదీప్ లాంటి చిన్నచిన్న నటులు ఎప్పుడో ఇందులోకి ఎంటరయ్యారు. తాజాగా రానా, వెంకటేష్ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారనే వార్త కూడా హైలెట్ అయింది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

మంచు లక్ష్మి ఓ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ను నాగార్జునకు వినిపించిందట. కొత్త ప్రయత్నాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే నాగ్, ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పాడనేది టాక్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్ ను అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేయబోతున్నాడట.

రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ గురించి చూచాయగా వెల్లడించింది మంచులక్ష్మి. ఓ పెద్ద స్టార్ తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆ ప్రాసెస్ ఇప్పుడు మొదలైనట్టుంది. అయితే ఇందులో నటించడానికి నాగ్ ఒప్పుకుంటాడా అనేది ప్రధానమైన ప్రశ్న.

ఎందుకంటే ఫేడవుట్ అయిన నటులు మాత్రమే వెబ్ సిరీస్ లో కనిపిస్తున్నారు. రానాను పక్కనపెడితే, సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా క్లిక్ అవ్వని తారలే వెబ్ సిరీస్ వైపు వెళ్లారు. నాగార్జునకు ఆ ప్రాబ్లమ్ లేదు. అతడితో సినిమాలు చేయడానికి చాలామంది రెడీ. పైగా నిర్మాతగా కూడా ఫుల్ బిజీ. సో.. ఇలాంటి టైమ్ లో వెబ్ సిరీస్ లో నాగ్ నటిస్తాడా అనేది చూడాలి.

మొత్తంగా 12-15 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఒకవేళ నాగ్ ఒప్పుకోకపోతే సుమంత్ తో సిరీస్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. మంచు లక్ష్మికి ఈ సెకండ్ ఆప్షనే వర్కవుట్ అయ్యేలా ఉంది.