స్పీడ్ పెంచాడు: ఒకేసారి 3 సినిమాలు

జస్ట్ 2 రోజుల కిందటే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు శర్వానంద్. ఈరోజు సుధీర్ వర్మ సినిమాను లాంఛ్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమా కూడా ఈ హీరో ఖాతాలో ఉంది. అది మల్టీస్టారర్ మూవీ.

దాగుడు మూతలు టైటిల్ తో ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ రాసుకున్నాడు హరీష్ శంకర్. ఈ మూవీ కోసం అమెరికాలో లొకేషన్లు కూడా ఫైనల్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాలో ఓ హీరో క్యారెక్టర్ చేసేందుకు శర్వానంద్ ఒప్పుకున్నాడు. మరో పాత్రలో నితిన్ నటించే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతానికైతే ఈ 3సినిమాల్ని ఓపెన్ చేసి పెట్టాడు శర్వానంద్. వీటిలో మొదట సెట్స్ పైకి వచ్చేది సుధీర్ వర్మ సినిమానే. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసమే గడ్డం పెంచాడు శర్వానంద్.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సుధీర్ వర్మ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత హను రాఘవపూడి సినిమాను స్టార్ట్ చేస్తాడు శర్వానంద్. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ అవుతుంది.