హలో.. సెల్ ఫోన్ చూశారా?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో ఓ చిన్న లాజిక్ అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ను త్రెడ్ గా తీసుకొని సినిమా అల్లేస్తుంటాడు ఈ దర్శకుడు. అఖిల్ లో కూడా అలాంటి సన్నటి త్రెడ్ ఉన్నట్టు తెలుస్తోంది. అదే సెల్ ఫోన్.

టీజర్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ మేకర్స్ విడుదల చేసిన స్టిల్ గమనిస్తే చాలా విషయాలు అర్థమౌతాయి. అందులో అఖిల్ జంపింగ్ సీన్ తో పాటు చుట్టూ మొబైల్స్ పెట్టారు. అంతేకాదు, నిన్న విడుదలైన టీజర్ లో కూడా అఖిల్ మొబైల్ లో మాట్లాడే షాట్ ఉంది.

ఫోన్ ఎత్తగానే ఎవరైనా ఫస్ట్ అనే పదం హలో. అలాంటి పదాన్ని టైటిల్ గా పెట్టి పోస్టర్, టీజర్ లో మొబైల్స్ ను హైలెట్ చేశారంటే.. కచ్చితంగా ఈ సినిమాకు సెల్ ఫోన్ కు ఏదో సంబంధం ఉందని అంతా ఫీలవుతున్నారు. అది నిజమే. చిన్నప్పుడే దూరమైన హీరోయిన్ ను కనుక్కునే క్రమంలో ఈ మొబైల్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుందట.

కంటికి కనిపించని హీరోయిన్ ను వెదికే క్రమంలో శత్రువులతో పోరాడుతుంటాడు అఖిల్. హీరోయిన్, శత్రువులకు మధ్య ఈ సెల్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తుంది. హలో సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇదే. గతంలో ’24’ సినిమా కోసం వాచ్, ‘మనం’ సినిమా కోసం క్లాక్ టవర్ ను కీ ఎలిమెంట్స్ గా వాడుకున్న విక్రమ్ కుమార్.. హలో కోసం సెల్ ఫోన్ ను వాడుకున్నాడన్నమాట.