ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు 300 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి అంటే అందరి ఫోకస్ బాలీవుడ్ పైన ఎక్కువగా ఉండేది. అక్కడే అగ్ర హీరోలు మొదట 500 కోట్ల వరకు బిజినెస్ చేసేలా టార్గెట్స్ పెంచుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కూడా అంతకుమించి అనేలా బిజినెస్ స్థాయిని పెంచుతున్నారు.
ఒక విధంగా ఇది మంచిదే అయినప్పటికీ కూడా ఆ సంఖ్య మాత్రం ప్రతీ సినిమాకు మరింత ఎక్కువగా పెరుగుతుంది. బాహుబలి నుంచి అసలు బిగ్ హీరోల సినిమాల బడ్జెట్స్ రెమ్యునరేషన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాల బడ్జెట్ లెక్కలు అతని పారితోషకంతో కలిపి చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతున్నాయి. సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కానీ ఏమాత్రం యావరేజ్ టాక్ వచ్చినా కూడా నిర్మాతలు పైన లేదా బయ్యర్లపైన ఆ ప్రభావం గట్టిగానే పడుతుంది.
అయితే ఇప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ దాదాపు 200 కోట్లకు టచ్ అవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో అతని సినిమాల బడ్జెట్ 500 కోట్లకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. తర్వాత అల్లు అర్జున్ కూడా అత్యధిక స్థాయిలో పారితోషకం తీసుకున్న సౌత్ హీరోగా రికార్డును క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ సినిమాతో కూడా అతని ఆదాయం 120 కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది.
లాభాల్లో వాటా అందుకునే విధంగా డీల్స్ సెట్ చేసుకోబోతున్న బన్నీ దాదాపు ఒక్కో సినిమా ద్వారా 130 కోట్ల వరకు సంపాదించుకునేలా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక రాబోయే అతని సినిమాల బడ్జెట్ ఈజీగా 300 కోట్లకు పైగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ తేజ్ లైనప్ లో పెట్టిన సినిమాలకు రెమ్యునరేషన్ ఇప్పటివరకు 100 కోట్ల దాటలేదు. కానీ బుచ్చిబాబు సినిమా తర్వాత సుకుమార్ తో చేయబోయే సినిమాకు మాత్రం అతని పారిపోషకం కూడా 130 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఆ సినిమా బడ్జెట్ కూడా 350 కోట్లు రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే బాటలో అడుగులు వేస్తూ ఉన్నాడు. దేవర ఏ మాత్రం హిట్ అయినా కూడా అతని తర్వాత సినిమాల బడ్జెట్ అమాంతం పెరిగిపోతాయి. దీంతో పారితోషకం లెక్క కూడా 100 కోట్లు దాటుతుంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు అసలే 1500 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక అతని పారితోషకం లెక్క ఆ తరువాత 250 కోట్లు దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ తరువాత సినిమాల బడ్జెట్ అనేది ఎలా ఉంటుందో ఊహలకు కూడా అందడం లేదు.
మొన్నటి వరకు ఈ స్టార్ హీరోల సినిమాల బడ్జెట్స్ 150 కోట్లు లేదా 200 కోట్ల కంటే తక్కువగానే ఉండేవి. ఇక ఇప్పుడు మార్కెట్ పరిధి పెరగడంతో పారితోషకాలు పెరుగుతున్నాయి. దీంతో సినిమా టోటల్ బడ్జెట్ ఈజీగా 300 కోట్లు లేదంటే 400 కోట్లు దాటుతోంది. వీరిని చూసి హీరోయిన్స్ సైతం మాకెందుకు తక్కువ ఇస్తారు అనే విధంగా వారి జీతాలు కూడా పెంచుతున్నారు. ఇక మరి కొంతమంది ప్రముఖ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా తామెందుకు తగ్గాలి అనేలా నిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అగ్ర హీరోలతో సినిమా అంటే ఇప్పుడు మినిమమ్ 300 కోట్లు దాటాల్సిందే అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.