‘రన్ రాజా రన్’ సినిమాతో పరిచయమైన రింగుల జుట్టు సుందరి సీరత్ కపూర్ ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినప్పటికీ కోరుకున్నంత బిజీ కాలేకపోయింది. దీంతో ఆమె పద్ధతి మార్చి బికినీలు వేయడం, టాప్‌లెస్‌గా ఫోజులివ్వడం చేసి సంచలనమైంది. దాంతో సీరత్‌కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మధ్య శ్రేణి చిత్రాలకి ఇప్పుడు సీరత్ ఫస్ట్ చాయిస్ హీరోయిన్ అవుతోంది.
అయితే దక్షిణాది చిత్ర సీమలో ఆదిలోనే ఇంతగా ఎక్స్పోజింగ్ చేస్తూ నిత్యం హాట్ ఫోటోషూట్స్‌తో వార్తల్లో వుండడం మంచిది కాదని ఆమెకి నాగార్జున హితవు చెప్పారట. ‘రాజుగారిగది 2’ చిత్రంలో నాగ్‌తో కలిసి చేస్తోన్న సీరత్‌కి ఆయన ఈ విషయంలో క్లాస్ తీసుకున్నారని, నాగ్ సలహా మేరకు సీరత్ తన పద్ధతి మార్చేసుకుందని, హాట్ ఫోటోషూట్లు మానేసిందని సమాచారం.
ఈమధ్య కాలంలో ఆమె మళ్లీ హాట్ ఫోటోల్లాంటివి సోషల్ మీడియాలో పెట్టలేదు. సీరత్లో సడన్‌గా వచ్చిన ఈ మార్పుకి నాగార్జునే కారణమని, ఆమెకి తన బ్యానర్లో తీసే సినిమాలో అవకాశమిస్తానని నాగ్ మాట ఇచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా సీరత్ ఫాన్స్‌కి హాట్ అప్డేట్స్ లేక ఊసుపోవడం లేదిపుడు పాపం.