బన్నీ సినిమా అన్నీ చూపించేస్తా..

ఆకట్టుకునే అందం… అదిరిపోయే ఫిజక్ అన్నీ ఉన్నా పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. తెలుగులో రెండు సినిమాలు చేసినా అవి అంతంతమాత్రమే అవడంతో ఆమెకు కాస్త గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు బన్నీ సినిమా దువ్వాడ జగన్నాథంలో ఆమెకు హీరోయిన్ చాన్సు వచ్చింది. ఈ సినిమాలో తాను ఏమాత్ర తగ్గబోనని.. బన్నీ సరసన అన్నీ చూపించేస్తానని అంటోంది.

బాలీవుడ్‌ లో ‘మొహంజొదారో’ లాంటి భారీ చిత్రంలో నటించిన పూజా హెగ్డే…మళ్లి తెలుగు సినిమా అవకాశం దక్కడంతో తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ‘ఐయామ్‌ బ్యాక్‌’ అంటూ సంతోషపడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన ‘దువ్వాడ జగన్నాథమ్‌’లో నటిస్తోంది పూజా. తెలుగులో ఆమె నటిస్తున్న మూడో చిత్రమిది. ‘ఒకలైలా కోసం’, ‘దోచెయ్‌’ లో నటించినా….విజయాలు దక్కలేదు. తెలుగులో రీఎంట్రీ గురించి పూజా మాట్లాడుతూ…”తెలుగులో గతంలో నటించిన చిత్రాల్లొ సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించాను. కానీ కొత్త చిత్రంలో నా అందం చూస్తారు. గ్లామర్‌ డాల్‌ గా ఉండే అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. ‘మొహంజొదారో’ సినిమా కోసం ముంబై వెళ్లే సమయానికి నాకు తెలుగు ఒక్క ముక్క రాదు. చిన్న చిన్న సంభాషణలు అర్థం చేసుకోవడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు తెలుగు బాగా అర్థమవుతోంది.” అని చెప్పింది.

బాలీవుడ్‌ లో అంత పెద్ద సినిమా చేసినా విజయం దక్కకపోవడంపై పూజా స్పందిస్తూ…” ఓ హీరోయిన్‌ అరంగేట్రం కోసం ‘మొహంజొదారో’ కంటే పెద్ద సినిమా ఏముంటుంది. అక్కడ భారీ చిత్రంతో పరిచయం అయ్యాను. హృతిక్‌ రోషన్‌ లాంటి స్టార్‌, అషుతోష్‌ గోవారికర్‌ లాంటి దర్శకుడు …ఆ సినిమాకు చేయాల్సినవి అన్నీ చేశాం. అయినా సక్సెస్‌ కాలేదు. కానీ ప్రస్తుతం నాకు హిందీ నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.” అంది. తెలుగులో బన్నీ సినిమా తన కెరీర్ ను మొత్తం మార్చేస్తుందని గట్టిగా నమ్ముతోందీ అమ్మడు.. మరి దువ్వాడ జగన్నాథంలో ఏం చూపిస్తుందో ఎంతగా అలరిస్తుందో మనమూ చూద్దా.