బాలీవుడ్‌కి పరిమితమైపోయిన తనకి ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టిన హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ అంటే దీపికా పడుకోన్ పడి చచ్చిపోతోందిప్పుడు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో సహజీవనం చేసిన దీపిక ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచీ అతడిని దూరం పెడుతోంది.
హాలీవుడ్ కండల వీరుడు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీ స్టార్ విన్ డీజిల్ గుండు మీద దీపిక మోజు పడుతోంది. అతడితో కెమిస్ట్రీ ఎలా ఉందనేది పబ్లిక్ మీటింగ్స్‌లోనే క్లియర్‌గా తెలుస్తోంది కనుక ”ఇద్దరి నడుమ ఏదైనా వుందా” అంటూ మీడియా ఆరా తీసింది. దానికి దీపిక ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా’ అంటూ బదులిచ్చిన దీపిక ఏమి మాట్లాడుతోందో అర్థం కాక తెల్ల మొహాలు వేసిన మీడియా వాళ్లకి దిమ్మ తిరిగే షాకిచ్చింది.
”నా మైండ్‌లో విన్ డీజిల్‌తో చాలా చాలా ఊహించేసుకుంటాను. అతడితో సహ జీవనం చేస్తాను. అద్భుతమైన పిల్లల్ని కంటాను. కానీ ఇదంతా నా మైండ్‌లోనే” అంటూ మనసులో మాట బయట పెట్టింది. అతనితో పిల్లల్ని కనేవరకు ఊహలు వెళ్లిపోయాయంటే దీపిక డీప్‌గానే పడిపోయిందని అర్థమవుతోంది. రణ్వీర్ ఇక మరో తోడు వెతుక్కోవాల్సిందే.