వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాటలు పక్కన పెట్టి చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ అన్నింటిని కూడా పధకాల రూపంలోనే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ సంక్షేమ పధకాలు కాబట్టి ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వైకాపాపై ఉన్నది.
గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగా హామీలు ఇచ్సి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పక్కన పెట్టె రకం కాదు జగన్ అని ఇప్పటికే ప్రజలకు అర్ధం అయ్యింది. పనులు చకచకా జరుగుతుండటంతో జగన్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే, ఇక్కకే ఓ చిక్కు ప్రశ్న ఉన్నది. ఇవన్నీ సంక్షేమ పధకాలు… కానీ, అసలు పూర్తి చేయాల్సినవి చాలా ఉన్నాయి. సంక్షేమ పధకాల వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అంటే చెందదు. అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి. ఎలా చేస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది.
ఏ రాష్ట్రమైన సుభిక్షంగా ఉండాలి అంటే నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి. నీరు ఉంటేనే పంటలు పండుతాయి. అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత నీటిపారుదల వ్యవస్థపై దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలకు రెండో స్థానం ఇచ్చారు. అందుకే చాలా స్పీడ్ గా చెరువుల పూడిక, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా ఇదే బాటలో నడవబోతున్నారు. 16 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్లోనే ఉన్నది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. కానీ, గత ప్రభుత్వం తాము ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పింది.
హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టును జగన్ పరిశీలించి 16 నెలల్లోనే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాలని, అద్భుతంగా ప్రాజెక్టును ఓపెన్ చేయాలనీ చెప్పారు. అంతా బాగుంది. నిధులే లేవు. కానీ, జగన్ నిధుల విషయంలో కూడా అధికారులకు హామీ ఇచ్చారు. జగన్ హామీ ఇచ్చారు అంటే చేసి తీరుతారని అందరికి తెలుసు. సో, వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని పోలవరం ఓపెన్ చేస్తే, జగన్ కు రాష్ట్రంలో తిరుగుండదు.