ఆర్.ఆర్.ఆర్. చిత్రంతో తానూ ఎలాగైనా అసోసియేట్ కావాలని భావించి నైజాం రైట్స్ విషయంలో మరొకరు పోటీకి రాకుండా 75 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుని తన పేరిట ఖాయం చేసుకున్నాడు. ఇందు నిమిత్తం పదిహేను కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. అయితే కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితులు తారుమారు అవడంతో దిల్ రాజు అంత అమౌంట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు.
ఇప్పటికే దీనిపై రాజమౌళికి కబురు పంపించాడు. అయితే ఒకసారి డీల్ ఓకే అయిన తర్వాత డిస్కషన్స్ ఏమిటని ఆర్.ఆర్.ఆర్. టీం చిరుబుర్రులాడారట. వేరే బయ్యర్లు వచ్చిన టైములో పోటీ పడి పరిస్థితులు మారగానే ప్లేట్ తిప్పడం ఏమిటన్నారట. అమౌంట్ తగ్గించేది లేదని, ఒకవేళ వద్దంటే కాన్సుల్ చేసుకోవాలని, సినిమా రిలీజ్ అయినా తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇస్తామని అంటున్నారట. దీంతో దిల్ రాజు ఇరుక్కుపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.