బన్నీ-వక్కంతం సినిమాకూ అతనే..

అయితే దేవిశ్రీ ప్రసాద్.. కాకుంటే తమన్.. తప్పదనుకుంటే అనూప్ రూబెన్స్.. టాలీవుడ్లో కొన్నేళ్లుగా పెద్ద సినిమాలన్నీ దాదాపుగా ఈ ముగ్గురు సంగీత దర్శకుల చుట్టూనే తిరుగుతున్నాయి. మన ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా మ్యూజిక్ ఇస్తారు.. పైనా కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుందని మన దర్శకులు ఎక్కువగా వీళ్ల మీదే ఆధారపడుతున్నారు. ఐతే ఈ ముగ్గురూ అన్ని సినిమాలకూ డేట్లు కేటాయించలేని పరిస్థితి. పైగా వీళ్ల మ్యూజిక్ కొంచెం రొటీన్ అయిపోతోంది.

అందుకే ఈ మధ్య టాలీవుడ్ దర్శక నిర్మాతలు పొరుగు భాషల వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకుంటే.. ప్రభాస్ కొత్త సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ పని చేయబోతున్నారు.

మరోవైపు రవితేజ కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’కు కూడా బాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అదే మ్యూజిక్ డైరెక్టర్ని అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు కూడా ఎంచుకున్నట్లు తాజా సమాచారం.

మామూలుగా అయితే లోకల్ మ్యూజిక్ డైరెక్టర్నే పెట్టుకునేవాళ్లేమో కానీ.. ప్రీతమ్ తెలుగులో సినిమా చేయడానికి ఓకే చెప్పేయడంతో వీళ్లు కూడా అప్రోచ్ అయ్యారట. అతను ఓకే అన్నాడట. ధూమ్‌.. దూమ్‌-2.. ధూమ్‌-3.. రేస్‌.. బ‌ర్ఫి.. ల‌వ్ ఆజ్ క‌ల్.. యే జ‌వాని హై దివాని.. భ‌జరంగి భాయిజాన్.. యే దిల్ హై ముష్కిల్‌.. దంగ‌ల్‌.. ఇలా బాలీవుడ్లో ప్రీతమ్ మామూలు మ్యూజికల్ హిట్లివ్వలేదు. మరి తెలుగులో అతడెలాంటి ముద్ర వేస్తాడో చూద్దాం.