నా తండ్రిని డాక్టర్లు చంపేశారు

ఉత్తరాది ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా సుపరిచితురాలైన సంభావన సేత్‌ తండ్రి ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. ఆయన జైపూర్ గోల్డెన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆక్సీజన్ లెవల్స్ పడిపోయిన సమయంలో ఆయన్ను వైధ్యులు పట్టించుకోలేదట. దాంతో తన తండ్రి చనిపోయాడంటూ సంభావన సేత్‌ ఆరోపిస్తుంది. తాను తన తండ్రి ని కోల్పోయినట్లుగా చాలా మంది వారి కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. వైధ్యుల నిర్లక్ష్యం కారణంగా తన తండ్రిని కోల్పోయాను. వారిపై న్యాయ పోరాటం చేస్తానంటూ ప్రకటించింది.

డాక్టర్లు దేవుళ్లు అంటారు. కాని ఇక్కడి డాక్టర్లు మాత్రం రాక్షసుల మాదిరిగా వ్యవహరించారు. వారు నా తండ్రి ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోలేదు. వారే నా తండ్రి ని చంపేశారు. నా జీవితంలో తండ్రి కోల్పోవడం అనేది చాలా బాధకరమైన విషయం. అయినా కూడా నేను నాన్న ఇచ్చిన ధైర్యంతో ఆసుపత్రిపై పోరాటంకు సిద్దం అవుతున్నాను. ఇప్పటికే ఆసుపత్రి కి లీగల్ నోటీసులు పంపించాను. నాకు మీరు మద్దతుగా ఉండండి అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై వైధ్యుల నుండి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు.