క్లారిటీ లేని అఖిల్‌తో నాగ్‌కి హెడ్డేక్‌!

తెలుగు సినిమా సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తోన్న పుకారు అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఇరవై రెండేళ్లకే పెళ్లి కొడుకు కావడానికి సిద్ధ పడ్డ అఖిల్‌ ఇప్పుడా ఆలోచన మానుకున్నాడనే వదంతులు తీవ్రమయ్యాయి. ఇందులో వాస్తవమెంత అనేది తెలియదు కానీ, అఖిల్‌ మొదట్నుంచీ ప్రతి విషయంలో క్లారిటీ లేకుండా వ్యవహరిస్తూ నాగ్‌కి తలనొప్పిగా మారాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

మొదట్లో క్రికెటర్‌ని అవుతానంటూ అసలు సినిమాల జోలికే రానన్నవాడు సడన్‌గా హీరో అవుతానంటూ ట్రెయినింగ్‌ తీసుకోవడానికి విదేశాలకి వెళ్లాడు. మొదటి సినిమాగా మంచి కథ కోసం చూద్దామంటే తనకి నచ్చిన కథనే తీద్దామంటూ వినాయక్‌ని ఫోర్స్‌ చేసి, నాగార్జునని బలవంతంగా ఒప్పించాడు.

అఖిల్‌ ఫ్లాప్‌ అవడంతో రెండో సినిమాకి పూర్తిగా తండ్రి మాట వింటానని చెప్పిన వాడే ఏ కథనీ తెగనివ్వలేదు. మంచి కథలు చాలానే రిజెక్ట్‌ చేస్తూ వచ్చిన అఖిల్‌ తాజాగా విక్రమ్‌ కుమార్‌ కథకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదట. అన్నిటికీ ఏదో వంక చెబుతోన్న అఖిల్‌తో పడలేనంటూ అతను నాగార్జునకి కంప్లయింట్‌ చేసాడట.

అఖిల్‌ కెరియర్‌ని చక్కదిద్దే వరకు కొత్త కమిట్‌మెంట్లు పెట్టుకోరాదని ఇప్పుడు అతని అన్ని మీటింగ్స్‌లోను నాగ్‌ కూడా తప్పక హాజరవుతున్నాడట. ఒకవైపు అతని కెరియర్‌ చక్కదిద్దడానికే నాగ్‌ సమయం కేటాయించలేకపోతోంటే, తాజాగా పెళ్లి పుకార్లు మొదలయ్యాయి. అఖిల్‌ ఇంతవరకు వ్యవహరించిన తీరుని బట్టి ఈ పుకార్లు కూడా నిజమే అయి వుంటాయంటూ నమ్మేస్తున్నారు సినీ జనాలు.