ఒకే ఒక్కడు అల్లు అర్జున్!

తెలుగు సినిమా పాటల్లో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న పాటగా రాములో రాములా లిరికల్ వీడియో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిదాలోని వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే పాట పేరిట ఉన్న రికార్డు అల వైకుంఠపురములో పేరిట ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఇంత వరకు ఏ తెలుగు పాట సాధించని ఘనత ఈ వీడియోకి దక్కింది.

250 మిలియన్ల వ్యూస్ తో రాములో రాములా లిరికల్ వీడియో చరిత్ర సృష్టించింది. రౌడీ బేబీ వీడియో మినహాయిస్తే దక్షిణాది మొత్తానికి ఇదే రికార్డు. రాములో రాములా వీడియో సాంగ్ విడుదల అయినా కానీ లిరికల్ సాంగ్ వీడియో క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ వేల సంఖ్యలో ఈ వీడియోని వీక్షిస్తున్నారు.

ఈ పాట ట్యూన్ ఒక ఫోక్ సాంగ్ నుంచి కాపీ కొట్టాడని తమన్ పై విమర్శలు వచ్చినా కానీ రాములో రాములా పాపులారిటీ కాస్త కూడా తగ్గలేదు. కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డులు సాధించిన బన్నీకి యూట్యూబ్ రికార్డులని కూడా తెచ్చిపెట్టిందీ త్రివిక్రమ్ క్రియేషన్.