ఆ పిల్లకి ప్రమోషన్‌ ఇచ్చిన చరణ్‌

‘అఆ’తో తెలుగు చిత్ర రంగంలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌ ఆ తర్వాత ప్రేమమ్‌తో మరో హిట్‌ కొట్టింది. తాజాగా శర్వానంద్‌ సినిమా ‘శతమానం భవతి’తోను హిట్‌ ట్రాక్‌ మీద వుందనే రిపోర్టులు వినిపిస్తున్నాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమ పల్లెటూరి పాత్రలకి అతికినట్టు సరిపోతుందనే ఫీలింగ్‌ టాలీవుడ్‌ మేకర్స్‌లో వచ్చింది.

అందుకే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌ వున్న సినిమాలకి అనుపమనే హీరోయిన్‌గా ఎంచుకుంటున్నారు. ఇంతవరకు మీడియం రేంజ్‌ సినిమాలు చేస్తూ వున్న అనుపమ త్వరలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సరసన కనిపించనుంది.

సుకుమార్‌ సినిమాలో ఒక హీరోయిన్‌గా అనుపమ ఖరారైంది. ఇందులో మరో హీరోయిన్‌ కూడా వుంటుంది కానీ చరణ్‌ సినిమాలో హీరోయిన్‌ అంటే ఇక ఏ లిస్ట్‌ హీరోయిన్‌ అయిపోయినట్టే.

ఇక నుంచి తనని పెద్ద హీరోలు కూడా కన్సిడర్‌ చేయడానికి ఈ చిత్రం హెల్ప్‌ చేస్తుంది. హీరోయిన్ల కొరత బాగా వున్న దశలో టాలీవుడ్‌లోకి వచ్చిన అనుపమ రైట్‌ క్యారెక్టర్లు చేపడుతూ తారాపధంలోకి దూసుకెళ్లిపోతోంది. టచ్‌వుడ్‌!