నితిన్కి స్ట్రాంగ్ అపోజిషన్

‘అ ఆ’ తర్వాత ఏ సినిమా చేయాలనే దానిపై చాలా తర్జనభర్జనలు పడిన నితిన్ ఫైనల్గా హను రాఘవపూడి డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అఖిల్తో హను చేద్దామనుకున్న కథ రాత్రికి రాత్రి చేతులు మారింది.

అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధలాంటి వైవిధ్యభరిత చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన హను ఈసారి కూడా చాలా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడట. ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కొత్తగా, పవర్ఫుల్గా వుంటుందట. ఈ పాత్ర కోసం పలువురి పేర్లు పరిశీలించి ఫైనల్గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ని ఖరారు చేసారట.

గతంలో నితిన్, అర్జున్ ఇద్దరూ ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో కలిసి నటించారు. అయితే అప్పుడు అర్జున్ సపోర్టింగ్ రోల్ చేస్తే ఈసారి నితిన్తో తలపడబోతున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్లో పూర్తి చేసి జూన్ లేదా జులైలో విడుదల చేయాలని చూస్తున్నారు.

‘అ ఆ’తో తనకి వచ్చిన మార్కెట్ని కన్సాలిడేట్ చేయడానికి ఈ భారీ చిత్రం ఉపయోగపడుతుందని అఖిల్ నమ్ముతున్నాడు. మరి అతని నమ్మకాన్ని హను ఎంతవరకు నిలబెడతాడనేది చూడాలి.