అర్జున్ రెడ్డి’ టీం స్ట్రాటజిక్ సారీ

ఈ రోజుల్లో మంచి కంటే కూడా చెడే జనాల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ టీం మొదట్నుంచి తమ సినిమాలోనే ‘చెడు’తో ప్రేక్షకుల్ని బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఆర్నెల్ల కిందట రిలీజ్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ టీజర్లో హీరో విజయ్ దేవరకొండ వాడిన పచ్చి బూతు.. టీజర్ చివర్లో వచ్చే లిప్ లాక్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్లో మిగతా కంటెంట్ కూడా బాగున్నప్పటికీ అప్పుడా టీజర్ మీద ఎక్కువ చర్చ నడిచింది ఆ బూతు.. ఆ ముద్దు మీదే. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూశాక.. ఆ తర్వాత కూడా సినిమాను ఇలాగే కాంట్రవర్శల్ వేలో అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.

మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ప్రసంగం ఎంతగా బూతు మయం అయిందో తెలిసిందే. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద ఎత్తున ‘అర్జున్ రెడ్డి’ లిప్ లాక్ పోస్టర్లతో పబ్లిసిటీ చేస్తుండగా.. దీనిపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు గొడవ చేశారు. మరోవైపు కొన్ని సంఘాలు కూడా దీనిపై ఆందోళన మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్ట్రాటజిగ్గా అందరికీ సారీ చెప్పింది. ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎవ్వరికీ ఏ విషయంలోనూ సారీ చెప్పేది లేదని.. ఎప్పుడు అగ్రెసివ్‌గా, కాన్ఫిడెంట్‌గానే ఉండాలని విజయ్ లెక్చర్లు దంచడం తెలిసిందే. అలాగే వీహెచ్‌ను ఉద్దేశించి అతను ‘తాతయ్యా.. చిల్’ అంటూ వెటకారంగా మెసేజ్ కూడా పెట్టాడు.

కానీ ఇంతలో ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ల విషయంలో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. అందరికీ సారీ చెప్పడమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టర్లన్నింటినీ తొలగించనున్నట్లు కూడా చెప్పింది. ఐతే ఇదంతా కూడా పబ్లిసిటీ కోసం వేసిన స్ట్రాటజిక్ మూవ్ లాగే కనిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’కి గురువారమే ప్రివ్యూలు పడుతున్నాయి. ఈలోపు ఈ పోస్టర్ల ద్వారా వచ్చే ప్రచారం కంటే కూడా.. వాటి మీద నెలకొన్న వివాదం వల్ల వచ్చే ప్రచారమే ఎక్కువ కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా ఉంది వాళ్ల వ్యవహారం చూస్తుంటే.