బండ్ల గాలి కేసిఆర్ వైపు

జనాలను గాల్లోకి లేపడంలో నిర్మాత-కమెడియన్ బండ్ల గణేష్ తరువాతే ఎవరైనా. అడియో ఫంక్షన్లలో, సక్సెస్ మీట్లలో మాటల బిస్కెట్ లు వేయడంలో గణేష్ తరువాతే ఎవరైనా. అలాంటి మాటకారి తనం వుంది మనోడికి. అయితే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లి చెడ్డయ్యాడు. అంతలోనే వాస్తవం అర్థమై, లెంపలేసుకుని, రాజకీయాలు వదిలేసాడు.

మళ్లీ సినిమాలు నిర్మించే ప్రయత్నాలు మొదలెట్టేసరికి కరోనా వచ్చి, బండ్ల బేసిక్ బిజినెస్ అయిన పౌల్ట్రీని గట్టి దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో నిన్నటికి నిన్న బండ్ల గణేష్ వరుస పెట్టి తెలంగాణ సిఎమ్ కేసిఆర్ మీద అరడజను ట్వీట్ లు వేసారు. సోషల్ మీడియాలో బండ్లకు కాస్త ఫాలోయింగ్ వుంది.

అందువల్ల, బండ్ల ఇలా వరుసపెట్టి, కేసిఆర్ ను దేవుడి లెవెల్ లో స్తుతిస్తూ ట్వీట్ లు వేయడం చూసి, కాస్త ఆశ్చర్యమే వ్యక్తం అవుతోంది. దీంతో ట్విట్టర్ జనాలు రకరకాల రిప్లయ్ లు, కామెంట్ లు పెడుతున్నారు. ఏడాదికిందట తెలిసి వుంటే బాగుండేదని, కేసిఆర్ తో పని పడిందా అని అంటున్నారు.

మొత్తానికి బండ్ల గణేష్ ఏదో విధంగా లైట్ లైట్ లో వుంటాడు సినిమాలు చేసినా చేయకున్నా.