ఈసారి బోయపాటి దొరికేస్తాడా?

‘జయ జానకి నాయక’ ట్రెయిలర్‌కి సోషల్‌ మీడియాలో వస్తోన్న ఫీడ్‌బ్యాక్‌ని బట్టి హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ వీక్‌ లింక్‌లా అనిపిస్తున్నాడనేది తేట తెల్లమైంది. ఇంతకాలం టాప్‌ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చిన బోయపాటి శ్రీను వారిని చాలా మాస్‌గా ప్రెజెంట్‌ చేసి బ్లాక్‌బస్టర్స్‌ సాధించాడు. మాస్‌ సినిమాలు తీయడంలో తనదైన ముద్ర వేసిన బోయపాటి శ్రీనుకి మిగతా టాప్‌ డైరెక్టర్ల మాదిరిగా ఫాలోయింగ్‌ వుండదు.

కాకపోతే మాస్‌ జనాలకి ఏమి కావాలనేది అతనికి బాగా తెలుసు. బాలకృష్ణ, అల్లు అర్జున్‌ లాంటి హీరోలు బోయపాటి శైలికి తగ్గట్టు మౌల్డ్‌ అయిపోయి ఘన విజయాలు అందుకున్నారు. ఈసారి చేతిలో స్టార్‌ లేకపోయినా కానీ బోయపాటి మాత్రం తన స్టయిల్లోనే ‘జయ జానకి నాయక’ తీసాడనేది అర్థమవుతోంది. కాకపోతే బోయపాటి బలం కంటే బెల్లంకొండ బలహీనతే ఇక్కడ హైలైట్‌ అవుతోంది.

అసలే మరో రెండు క్రేజీ చిత్రాలతో పోటీగా రిలీజ్‌ అవుతూ వుండడంతో యావరేజ్‌ ప్రాడక్ట్‌లు చెల్లవు. బలహీనతలు కవర్‌ చేసే హీరో కూడా లేడు కనుక ఇది బోయపాటికి అగ్ని పరీక్షే. ఈసారి కూడా బోయపాటి గెలిచేసాడంటే మాత్రం ఇక దర్శకుడిగా అతని సామర్ధ్యాన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరూ సాహసించరు. హీరోతో సంబంధం లేకుండా బోయపాటిని మాత్రమే నమ్ముతోన్న బిజినెస్‌ వర్గాలు మాత్రం అతని సామర్ధ్యంపై నమ్మకంగానే వున్నాయి.