ఆమె వీపు చూసి బిత్తరపోయాడు

తెర మీద అంతలేసి విలన్లని ఎత్తి కుదేసే సూపర్‌స్టారే కానీ, నిజ జీవితంలో అందగత్తె ఒంటి స్పర్శకి మాత్రం బిగుసుకుపోయాడు. సనా ఖాన్‌కి సల్మాన్‌ఖాన్‌ ఇచ్చిన ఇబ్బందికర ఆలింగనం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్‌ అయింది. ఓ ఈవెంట్‌ సందర్భంగా సనా ఖాన్‌ ఎదురు పడగా, పలకరింపుగా ఆలింగనం ఇవ్వడానికి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌కి షాక్‌ తగిలింది.

ముందు నుంచి పూర్తిగా కవర్‌ చేసుకున్న సనా ఖాన్‌ వీపుపై మాత్రం అసలు ఆచ్ఛాదనే లేకుండా వచ్చింది. ఆమెని కౌగిలించుకుంటూ వుండగా వీపుపై ఆమె కవర్‌ చేసుకోలేదని తెలిసి సల్మాన్‌ బిగిసిపోయాడు. రెండు పిడికిళ్లు బిగించేసి ఆమె వీపుకి చేతులు తాకించకుండా కౌగిలించుకున్నాడు. ఆలింగనర తర్వాత కూడా సల్మాన్‌ ముఖంలో ఆ ఇబ్బంది ఛాయలు స్పష్టంగా కనిపించాయి.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది. ఎప్పుడూ బికినీలు, పొట్టి పొట్టి బట్టలేసుకుని తిరిగే హీరోయిన్ల మధ్య వుండే సల్మాన్‌ కూడా ఒక సగటు మగాడిలా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. తెరపై హీరోయిన్లతో హద్దుల్లో వుండే సల్మాన్‌ నిజ జీవితంలోను తానెంత బిడియస్తుడనేది ఈ సీన్‌తో చెప్పకనే చెప్పాడు.