ఖైదీ తర్వాత ఆమెని అందులోంచీ పీకేసారు

‘ఖైదీ నంబర్‌ 150’లో రత్తాలు పాటకి డాన్స్‌ చేయాల్సిన క్యాథరీన్‌ ఆ అవకాశాన్ని కోల్పోయింది. లారెన్స్‌తో గొడవ పెట్టుకుని ఆ మంచి ఛాన్స్‌ని లక్ష్మిరాయ్‌కి కోల్పోయిన క్యాథరీన్‌ తాజాగా మరో చిత్రం కూడా చేజార్చుకుంది.

ప్రభుదేవాతో ఒక తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం క్యాథరీన్‌ని వరించింది. మరి సడన్‌గా ఏమైందో ఆమెని తొలగించి తన స్థానంలో లక్ష్మి మీనన్‌ని తీసుకున్నారు. దీనికి కారణం ఏమిటనేది తెలియదు కానీ ఈ ఊస్టింగ్‌ ఖచ్చితంగా ఆమె కెరియర్‌ని ఇబ్బందుల్లో పడేస్తుంది. వరుసగా ఇలా ఒక హీరోయిన్‌ని తీసేస్తున్నారంటే ఇక ఆమెని తీసుకునేందుకు ఎవరూ ముందుకి రాకపోవచ్చు.

కెరియర్‌ మొదట్లో ఏదీ కలిసి రాకపోయినా సరైనోడుతో సక్సెస్‌ సాధించిన క్యాథరీన్‌ ఆ విజయాన్ని క్యాష్‌ చేసుకోకుండా ఇలా వచ్చిన అవకాశాలని కాలదన్నుకుంటోంది. ఆమెకి ఆటిట్యూడ్‌ ప్రాబ్లమ్‌ వుందని, సెట్స్‌లో మరీ పొగరుగా బిహేవ్‌ చేస్తుంటుందని రూమర్స్‌ వున్నాయి. సినీ రంగంలో లౌక్యం లేకపోతే కష్టమనే సంగతి క్యాథరీన్‌కి ఇంకా బోధ పడకపోవడమేంటో మరి. భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చినప్పటికీ సమంత, కాజల్‌, శృతిహాసన్‌ లాంటి వాళ్లు లౌక్యంతో అందరినీ మచ్చిక చేసుకోవడానికి నిత్యం చేసే ప్రయత్నాలు చూస్తూ అయినా క్యాథరీన్‌ రియలైజ్‌ అవ్వాల్సింది. వరుస ఊస్టింగులతో ఆమె కెరియర్‌ ఇప్పుడిక ఎటు టర్న్‌ అవుతుందో ఏమిటో చూడాలి.