మైత్రి వారితో సెటిల్మెంట్ కోసం దుబాయ్ కు వెళ్లిన దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో దిల్ రాజు ఏక ఛత్రాదిపత్యం కొనసాగుతుండడంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే వరంగల్ శ్రీనుతో దిల్ రాజు వ్యవహారం కూడా చెడ్డ పేరు తెచ్చి పెట్టింది.

ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ తో దిల్ రాజుకు మంచి అనుబంధం ఉంది. వారి సినిమాలు అన్నీ నైజాం ఏరియాలో దిల్ రాజు పంపిణీ చేస్తూ వస్తున్నాడు. అయితే మైత్రి వారు కూడా పంపిణీ రంగంలోకి దిగుతున్నారని ఉప్పెన చిత్రాన్ని వారే స్వయంగా విడుదల చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది.

ఈ వార్తలు విన్న దిల్ రాజు వెంటనే దుబాయ్ కు పయనమయినట్లు సమాచారం. మైత్రి వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మైత్రి మూవీస్ రూమర్స్ ను నమ్మవద్దని, తమ అనుబంధం ఇలానే కొనసాగుతుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి ఇప్పుడు వరసగా టాప్ సినిమాలను చేస్తోంది. పవన్, మహేష్, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.