ట్రంఫ్ ఎఫెక్ట్ః యూఎస్‌లో టాలీవుడ్ బిజినెస్ ప‌డిపోతోంది

ఏంటో…ఇపుడు అమెరికాలో ఏం జ‌రిగిన అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముడిపెట్టాల్సి వ‌స్తోంది. ట్రంప్ అండతో చెల‌రేగిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుండ‌టం దీనికి కార‌ణం కావ‌చ్చు. ఇటీవ‌ల జ‌రిగిన జాత్యాంహ‌కార దాడుల నేప‌థ్యంలో వివిధ సంఘాల సూచ‌న‌లు, శ్రేయోభిలాషుల సల‌హాలు కావ‌చ్చు లేక‌పోతే సొంత ఆలోచ‌న‌లు కావ‌చ్చు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు కానీ…అమెరికాలోని తెలుగువారు సినిమాలు చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. టాలీవుడ్ సినిమాల కలెక్ష‌న్లే ఇందుకు నిద‌ర్శ‌నం.ఓవర్సీస్ విషయంలో మనకు అమెరికాలోనే ఎక్కువ మార్కెట్ ఉంది. కానీ వెరీ రీసెంట్ గా అక్కడ మన మూవీస్ కలెక్షన్స్ పడిపోయినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కొన్నేళ్లుగా మన టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. విదేశాల్లో మన మూవీ మార్కెట్ బాగా పికప్ అయింది. ఒక రేంజ్ లో చూస్తే బాలీవుడ్ తో తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాలే కాక, మీడియం రేంజ్ హీరోల పిక్చర్స్ కూడా ఓవర్సీస్ లో బాగా కలెక్షన్స్ తెచ్చిపెడుతున్నాయి. సీనియర్స్ పిక్చర్సే కాకుండా యూత్ హీరోల మూవీస్ కూడా బాగానే ఫేర్ చేస్తున్నాయి. స్టోరీ, సినిమా బాగుంటే హీరోతో పనిలేకుండా అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఈమధ్య అక్కడ మన టాలీవుడ్ మూవీస్ వసూళ్లు డౌన్ అయ్యాయట. ఉత్తర అమెరికాలో టాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోయాయి. రెండు వారాలుగా తెలుగు సినిమాల కలెక్షన్లు పడిపోయాయి. రానా మూవీ ఘాజీ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత విడుదలైన విన్నర్, యమన్ చిత్రాలే కాదు. రాజ్ తరుణ్ మూవీ – కిట్టు ఉన్నాడు జాగ్రత్త, విజయ్ దేవరకొండ సినిమా ద్వారక, మంచు మనోజ్ చిత్రం గుంటూరోడు సినిమాల కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట. ద్వారక, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గుంటూరోడు సినిమాలకు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయట. ఈ మూడు చిత్రాలు దాదాపు 66 లక్షల రూపాయల లోపే వసూళ్లు మాత్రమే సాధించాయని అంచనా. పెళ్లి చూపులు సినిమాతో 10 లక్షలకు పైగా డాలర్ల కలెక్ట్ చేసి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఈసారి ద్వారకతో ఆ స్థాయికి చేరుకోలేకపోయాడు.. కిట్టూ, గుంటూరోడు సినిమాలు చాలా డల్ గా నడుస్తున్నాయని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇలా క‌లెక్ష‌న్స్ డ‌ల్ అవ‌డం వెనుక కార‌ణం ఏంటో సినీ వ‌ర్గాలు విశ్లేషించాలి.