ఆయన మాట ప్రకారమే సమంత సినిమాల్లోకి వచ్చిందట

ఎంత దూరం ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఎంత సక్సెస్ ఫుల్ కెరీర్ సాగిస్తున్నవారైనా తొలుత సాధారణంగానే ప్రస్థానం మొదలుపెడతారు.  ఎవరో కొద్ది మంది మాత్రమే బంగారు చెంచాతో కెరీర్ స్టార్ట్  చేస్తుంటారు. స్టార్ హీరోయిన్ సమంతది కూడా అదే పరిస్థితి. ఆమె  కెరీర్ బిగినింగ్  చాలా ఆర్డిన‌రీగా  ఉండేదట.   త‌ను ప్రారంభంలో ఉండ‌గా చిన్న చిన్న యాడ్స్  లో న‌టించేది.

కోకిల‌, కీచురాళ్లు చిత్రాల ఫేమ్  డైరెక్ట‌ర్ గీతాకృష్ణ స్వ‌త‌హాగా  యాడ్స్  డైరెక్ట‌ర్స్.  అప్ప‌ట్లో   ఒక ట‌ర్మ‌రిక్ యాడ్ లో  స‌మంత  న‌టించింద‌ట‌. ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న  డైరెక్ట్ చేసింది  గీతాకృష్ణ . అప్ప‌ట్లో స‌మంత  బాగా పొట్టిగా క్యూట్ గా ఉండేద‌ట‌. స‌మంతను అబ్జ‌ర్వ్ చేసిన త‌రువాత  నీవు సినిమాల‌కు బావుంటావు ట్రై చేయొచ్చ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌.  ఆయన సలహాతోనే సమంత సినీ ఇండస్ర్టీకి దొరికింది.

షూటింగ్ అయిన త‌రువాత  డైరెక్ట‌రే  స‌మంత‌ను  హాస్ట‌ల్లో డ్రాప్ చేసేవార‌ట‌.ఈ విష‌యం ఈ మ‌ధ్య  ఒక సోష‌ల్  నెట్ వ‌ర్క్ వెబ్ సైట్ కు ఇచ్చిన  ఇంటర్వూలో  గీతా కృష్ణ   చెప్పాడు.

స‌మంత‌…గీతా కృష్ణ గారి స‌ల‌హాను న‌మ్మి చిత్రాల‌కు వ‌చ్చిందో..! లేక  యాడ్స్ లో న‌టించింది కాబ‌ట్టి..  సినిమాలు చేద్దామ‌నుకుందో..!  మొత్తం మీద  ఈ రోజు  సూప‌ర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కొంత ల‌క్..కొంత త‌న  హార్డ్ వ‌ర్క్ క‌ల‌సి వ‌చ్చాయిని త‌నే చెబుతుంటుంది సమంతా.  ఇక  త్వ‌ర‌లో అక్కినేని వారి  ఇంటి కోడలు కాబోతుంది.