సినిమా చూసి కొట్టేస్తారనుకున్నా

ఎవరైనా సినిమా చూపిస్తే ఆనందిస్తారు. మహా అయితే అభినందనలతో ముంచెత్తుతారు. కానీ కొట్టడమేంటి అనుకుంటున్నారా. అయితే సాధారణ సినిమాలైతే ఇష్టమైతే చూస్తారు. లేదంటే లేచెళ్లిపోతారు. కానీ బస్టాప్ లాంటి సినిమాలకు మాత్రం అలా జరగదనుకున్నాడట మారుతి.

అప్పట్లో మారుతి బస్టాప్ మూవీ యూత్ ఫుల్ సినిమాలకు కొత్త అర్థం చెప్పింది. అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అనూహ్యంగా హిట్టైపోయింది. పైకి వల్గర్ గా కనిపించినా.. అంతర్లీనంగా ఉండే మెసేజ్ సినిమాను హిట్ చేసింది.

అసలు బస్టాప్ మూవీ తీయడానికి మారుతి పురిటినొప్పులు అనుభవించారట. ముందు సగం తీసి ఆపేశారట. తర్వాత డబ్బులు చాలక చిన్న సినిమాగా ఈరోజుల్లో మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ దగ్గర చేబదుళ్లు తీసుకున్నారు.

కానీ బస్టాప్ మూవీలో అడల్ట్ కంటెంట్ ఉందని అందరూ మారుతిని భయపెట్టారట. అయితే సినిమా రిలీజయ్యాక మాత్రం విమర్శలతో మాత్రం డబ్బుల్ని కూడా వెనక్కితెచ్చిందట. ఈరోజుల్లో, బస్టాప్ మూవీస్ తరవాత ప్రేమకథా చిత్రమ్ కూడా హిట్ కావడంతో.. మారుతి తిరుగులేని డైరక్టర్ అయ్యారట.