ఫొటో స్టోరీ: 40 ప్లస్‌లో ఇంత సెగలా?

హీరోయిన్లకు 30 ఏళ్లు దాటాయంటే గ్లామర్ దెబ్బ తినేస్తుంది. మేకప్‌తో ఎంత మేనేజ్ చేసినప్పటికీ వయసు మీద పడ్డ సంగతి స్పష్టంగా తెలిసిపోతుంటుంది. లేటు వయసులో ఎక్స్‌పోజింగ్ చేస్తే చూసేవాళ్లకూ ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ శిల్పా శెట్టి మాత్రం ఇందుకు మినహాయింపు. 40 ప్లస్‌లోనూ ఆమె తన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తున్న తీరుకు విస్తుబోవాల్సిందే. హీరోయిన్‌గా కెరీర్ ముగిశాక యోగా బాట పట్టి.. యోగా పాఠాలతో స్పెషల్ వీడియోలు కూడా రిలీజ్ చేసిన శిల్పా.. చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

అప్పుడప్పుడూ ఆమె చేసే ఫొటో షూట్లు జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా శిల్పా చేసిన ఒక ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఆమె చేసిన ఫొటో షూట్లలో కొంచెం పద్ధతిగానే కనిపించింది. కానీ తాజా ఫొటో షూట్లో క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టేస్తోంది. శిల్పాలో హాట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ ఫొటోలే రుజువు. ఇప్పటికీ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగల్చగలనని సవాలు చేస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో షూట్లో శిల్పా తీరు చూస్తే.