గాళ్ ఫ్రెండ్ కార‌ణంగా “హ‌లో” స్టిల్ బ‌య‌ట‌కు!

అఖిల్ తాజా మూవీ హ‌లో. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒక‌టి లీక్ కావ‌టం.. అదంతా ప్ర‌చారం కోస‌మేన‌న్న మాట జోరుగా స్ప్రెడ్ అయ్యింది. విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ష‌న్ లో అఖిల్ చేస్తున్న ఈ మూవీ స్టిల్ లీక్ పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. స్టిల్ లీక్ కావ‌టం ఏంటి బాసూ.. వెనుక చాలా లెక్కుంద‌న్న మాట‌లు చాలానే వినిపించాయి.

తాజాగా హ‌లో స్టిల్ లీకుపై ఆ చిత్ర నిర్మాత నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌చారం కోసం స్టిల్ లీక్ చేయ‌లేద‌ని.. అలాంటి అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న లీకు వెనుక అస‌లు సంగ‌తిదే అంటూ చెప్పుకొచ్చారు. లీకుపై నాగ్ చెప్పిందేమిట‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే వింటే..

“హ‌లో పోస్ట‌ర్ డిజైన్ కోస‌మ‌ని హాంకాంగ్ లో ఉన్న స్నేహితుడికి విక్ర‌మ్ కుమార్ స్టిల్ పంపించాడు. మ‌నం మూవీకి కూడా అత‌నే పోస్ట‌ర్స్ డిజైన్ చేశాడు. అక్క‌డ‌త‌ను వాళ్ల గాళ్ ఫ్రెండ్ కు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా స్టిల్ బ‌య‌ట‌కువ‌చ్చింది. ఏదో స్ట్రాట‌జీతో లీక్ చేయ‌లేదు. నిజానికి లీక్ అయ్యే టైంకి లోగో కూడా అనుకోలేదు” అంటూ అస‌లు విష‌యాన్ని చెప్పుకొచ్చారు.
హ‌లో టైటిల్ పెట్టాల‌న్న ఆలోచ‌న వెనుకున్న ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను చెప్పారు. త‌న‌కు మంచి ఆలోచ‌న‌ల‌న్నీ ఉద‌యం ఆరు నుంచి ఆరున్న‌ర లోపే వ‌స్తాయ‌న్న నాగ్‌.. మైండ్ ఫ్రెష్ గా ఉన్న ఆ టైంలో ఐడియాలు వ‌స్తాయ‌న్నారు. సినిమాకు ఏ పేరు పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ప్పుడు.. స‌డ‌న్ గా ఓ రోజు పొద్దున్నే హ‌లో పేరు పెడితే బాగుంటుంద‌నిపించింద‌ని.. వెంట‌నే సుప్రియ‌కు ఫోన్ చేసి హ‌లో టైటిల్ రిజిస్ట‌ర్ చేయాల‌ని చెప్పాన‌న్నారు.