డర్టీ హరి మేకర్స్‌ పై కేసు నమోదు

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘డర్టీ హరి’. ఈ సినిమాను త్వరలో ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ యాప్‌ ద్వారా పేఫర్‌ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసమయంలోనే ఈ సినిమా యువతను పక్క ద్రోవ పట్టించే విధంగా ఉందని అలాగే అమ్మాయిలను మహిళలను కించ పర్చే విధంగా ఉంది అంటూ కొందరు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ విషయమై ఎంక్వౌరీ మొదుల పెట్టారు. సినిమా విడుదలకు స్టే ఇచ్చేందుకు గాను కోర్టుకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది.

బోల్డ్‌ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా కోసం యూత్‌ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా కేసులు నమోదు అవ్వడంతో మేకర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న మేకర్స్‌ పై కేసు నమోదం వల్ల సినిమా విడుదల ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయమై డర్టీ హరి సినిమా విడుదల సస్పెన్స్‌ లో పడ్డట్లయ్యింది.