అతడి ఒడిలో ఆ హీరోయిన్‌!!

ఈషా గుప్తా… ఛామన చాయలో ఇండియన్‌ బ్యూటీకి నిలువెత్తు నిదర్శనంలా వుంటుంది. ఆమె పెదవులు, కను, ముక్కు తీరు చూసి ఇండియన్‌ ఏంజెలినా జోలీ అని అభిమానులు పిలుచుకుంటూ వుంటారు. వెండితెరపై కనిపించినపుడల్లా తన అందచందాలతో మరులగొలిపే ఈషా ప్రైవేట్‌ ఫోటో షూట్‌ అయినా అంతే స్థాయిలో హీటు పుట్టిస్తుంది.

ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని తు.చ. తప్పకుండా పాటించే ఈషా మామూలుగా కనిపించినపుడు కూడా సెక్సీ అనే పదానికి సినానిమ్‌లా అనిపిస్తూ వుంటుంది. ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లు పిచ్చిగా వేసుకు తిరుగుతోన్న రిప్‌డ్‌ జీన్స్‌ వేసుకుని, వీ నెక్‌ కట్‌తో క్లీవేజీ కనిపించేలా టాప్‌ వేసుకుని ఆమె ఎంత సెక్సీగా వుందో చూడండిక్కడ. ఆమె వరకు ఓకే కానీ ఇంతకీ ఆమె ఎవరి ఒడిలో కూర్చుందిక్కడ. ఇతగాడి పేరు పరిక్షత్‌ వాద్వానీ.

సెలబ్రిటీలకి బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్‌ ఇప్పిస్తుంటాడు. ఇతడితో ఈషాకి వున్న కనక్షన్‌ ఏమిటో గానీ ఎప్పుడూ చూసినా ఇతడిని హత్తుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ లేదా ఇలా ఒడిలో కూర్చుంటూ కనిపిస్తుంది. ఇద్దరి మధ్య షార్ట్‌ టర్మ్‌ రిలేషన్‌ వుందా లేదా లాంగ్‌ టర్మా అనేది తెలియదు కానీ ఈషా అంటే పడిచచ్చే అభిమానులకి మాత్రం ఇతగాడిని చూస్తే ఈర్ష్యతో గుండెలు రగిలిపోవడం గ్యారెంటీ.